కీర్తి సురేష్ .. టాలీవుడ్ ఇండస్ట్రీ మహానటిగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందానికి అందం ..నటనకి నటన ..అభినయానికి అభినయం ..ఒకటా రెండా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో . కాగా రీసెంట్గా కీర్తి సురేష్ తన అభిమానికి బహిరంగంగా క్షమాపనులు చెప్పుకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.
కీర్తి సురేష్ ఎప్పుడు కూడా అభిమానులను డిసప్పాయింట్ చేయదు. ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్లతో చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది . అయితే కృష్ణ అనే వీర అభిమాని కీర్తి సురేష్ కు ట్విట్టర్ వేదికగా 233 లేఖలు రాశాడు. కానీ కీర్తి సురేష్ ఒక్కదానికి రిప్లై ఇవ్వలేదు . అయినా సరే ఆ అభిమాని తన ఫేవరెట్ హీరోయిన్ కి లేఖలు రాస్తూనే వచ్చాడు. ఫైనల్లీ కీర్తి సురేష్ ఆ అభిమాని లేఖలకు రిప్లై ఇచ్చింది .
మొత్తంగా 234వ సారి కీర్తి ఆ అభిమానికి రిప్లై ఇవ్వడం గమనార్హం. ఆలస్యంగా రిప్లై ఇచ్చినందుకు సారీ కూడా చెప్పింది.. అది నా ఫాంటసీ నెంబర్ అని.. మీలాంటి అభిమానులు ఉండడం నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అని ఎమోషనల్ అయింది. దీంతో కీర్తి సురేష్ పేరు మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. కాగా కీర్తి సురేష్ పలు సినిమాలతో బిజీ బిజీ గా ముందుకు వెళ్తుంది..!!