ఇలియానా .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . గోవా బ్యూటీ మన తెలుగు జనాలను బాగా ఆకట్టుకునింది . ఇలియానా అనడం కన్నా కూడా బెల్లి బ్యూటీ అనడం చాలా చాలా అభిమానులకి నచ్చుతుంది .ఎవరైనా సరే నడుము ఎలా ఉండాలి అంటే అందరూ టక్కున ఇలియానానే చూపిస్తారు . మేకర్స్ కూడా ఆమె నడుమును సినిమాలో ఇష్టం వచ్చిన విధంగా వాడేసారు. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన ఇలియానా బాలీవుడ్ లో కి వెళ్లి సెటిల్ అవ్వాలనుకునింది .
బాలీవుడ్ కి వెళ్లాక అమ్మడుని వాడుకున్నన్ని రోజులు వాడుకొని ఆ తర్వాత వదిలేసారు బాలీవుడ్ జనాలు. రీసెంట్ గానే ఇలియానా పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. అయితే రీసెంట్ గా ఇలియానా బిడ్డ పుట్టిన తర్వాత ఆమె ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలను బయటపెట్టింది . డెలివరీ తర్వాత ఆమె తన బిడ్డకు దూరంగా ఉండిందట . ఆమె సపరేట్గా ఒక రూమ్ లో పడుకోనంటే బిడ్డ సపరేట్గా ఒక రూమ్ లో డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నాడట .
అంతేకాదు బిడ్డ పుట్టిన తర్వాత మొదటి టచ్ కి కూడా దూరమయ్యానని .. అప్పుడు అన్ని మైకేల్ డోలాన్ చూసుకున్నారు అని ఆమె చెప్పుకొచ్చింది . అంతేకాదు అలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు అని పోస్ట్ చేసింది. దీనితో సోషల్ మీడియాలో ఇలియానాకు ఏదైనా జబ్బుందా ..? అన్న కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి . డెలివరీ తర్వాత ఎవరు కూడా తల్లిని బిడ్డని దూరం పెట్టరు . మరి వీళ్ళని పెట్టారు అంటే డాక్టర్స్ ఏదో కారణం ఉంటుంది. ఆమెకు ఏదైనా భయంకరమైన జబ్బు వచ్చిందేమో..? అందుకే దూరం పెట్టారేమో అంటూ చర్చించుకుంటున్నారు జనాలు..!!