Movies"ఆ పని చేస్తే వచ్చిన ఫీలింగ్ లైఫ్ లో మర్చిపోలేను".. మళ్లీ...

“ఆ పని చేస్తే వచ్చిన ఫీలింగ్ లైఫ్ లో మర్చిపోలేను”.. మళ్లీ మంట పెట్టిన మెగా డాటర్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా పాపులారిటీ దక్కించుకోలేదు . కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా పాపులారిటీ దక్కించుకుంది . ఇటీవల ఆమె తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే . భర్తతో కలిసి ఉన్నప్పుడు ఆమె ఎలాంటి ఫొటోస్ షేర్ చేసిందో కూడా మనం చూశాం.

ఏకంగా లిప్ లాక్ ఇస్తూ .. పర్సనల్ ఫొటోస్ కూడా షేర్ చేసింది . ఆ ఫొటోస్ చూసి మెగా అభిమానులు సైతం షాక్ అయిపోయారు. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో ఎవరు ఇలాంటి ఫోటో షేర్ చేయలేదని కూడా చెప్పుకొచ్చారు . విడాకుల తర్వాత లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న నిహారిక రీసెంట్ గా ఓ నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించింది . పలు వెబ్ సిరీస్, మూవీలు నిర్మిస్తూ టాలెంట్ చూపిస్తున్న ఈ మెగా డాటర్ రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

నిహారిక తన ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది . అందులో వెదురు బొంగులో వండుకొని తింటున్నట్లు ఫొటోస్ ఆధారంగా తెలుస్తుంది . దానికి ఆమె రాసుకొస్తూ ..”మేము అడవి మధ్యలో వెదురు బొంగులో వంట చేసుకుని తింటున్నాము.. అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్.. మళ్లీమళ్లీ రానిది “అంటూ రాసుకొచ్చింది . ప్రస్తుతం ఆమె థాయిలాండ్ అడవిలో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news