బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లోతెరకెక్కిన లేటెస్ట్ సినిమా ఫైటర్. ప్రస్తుతం ఇండియన్ సినీ జనాలు మోస్ట్ అవైటెడ్ సినిమాగా వెయిట్ చేస్తోన్న ఈ ఫైటర్ సినిమాపై అంచనాలు స్కై రేంజ్‌లో ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలతో పోల్చి చూస్తే ఇది చాలా తక్కువ బజ్‌లోనే రిలీజ్ అవుతోంది.
బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ అంతా ఊగిపోయింది. అలాంటి సెన్షేషనల్ హిట్స్ ఉన్నా కూడా ఫైటర్ సినిమాకు ఆ రేంజ్లో బజ్ అయితే లేదు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ రివ్యూను బాలీవుడ్ ఫేమస్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఇచ్చేశారు. ఈ సినిమాకు ఆయన ఏకంగా నాలుగున్నర స్టార్స్ రేటింగ్ ఇచ్చారు.
నిజానికి తరుణ్ ఆదర్శ్ ఈ రేంజ్లో రేటింగ్ ఇవ్వడం అంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టరే అయ్యి ఉంటుందని.. గూస్‌బంప్స్ మోత మోగించేస్తోందన్న చర్చలు కూడా సోషల్ మీడియాలో వైరల్ లవుతున్నాయి. హృతిక్ రోషన్ – దీపికా పదుకొనే జంటగా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీన్లు అదిరిపోయాయట. భారత వైమానిక దళం నేపథ్యంలో ఫస్ట్ ఏరియల్ యాక్షన్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించారు.
సిద్ధార్థ్ ఆనంద్ చాలా బ్రిలియంట్‌గా ఫైటర్ తెరకెక్కించారని తరుణ్ ప్రశంసించారు. దర్శకుడు సిద్ధార్థ్ ఫైటర్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టారని.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు డ్రామా, ఎమోషన్స్, దేశభక్తి మేళవింపుతో సినిమా అదిరిపోయిందనే సోషల్ మీడియాలో టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది. హృతిక్ సినిమాలో షో టాపర్ అని.. దీపిక – హృతిక్ కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉందంటున్నారు. అనిల్ కపూర్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించారని.. సెకండాఫ్ ఫైటర్ సినిమాకు ప్రధాన బలం అని.. సినిమాలో విజిల్స్ వేయించుకునే యాక్షన్ సీన్లు, డైలాగులు ఎన్నో ఉన్నాయని తరుణ్ ఆదర్శ్ ప్రశంసించారు.
హృతిక్ భారీ హిట్ కొట్టాడని.. సినిమాలో బీజీఎంతో పాటు గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ అదిరిపోయాయని నెటిజన్లు అంటున్నారు. దేశభక్తి ఉన్న ఇలాంటి ఏరియల్ యాక్షన్ సినిమాను తాము ఇప్పటి వరకు చూడలేదని కూడా కొందరు చెపుతున్నారు. అనిల్ కపూర్ సినిమాకు ఆత్మ అని.. ఫైటర్ దీపిక కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుందనే ఎక్కువ మంది చెపుతున్నారు. ఫైనల్‌గా ఫైటర్ వార్, పఠాన్ రేంజ్ సినిమా కాకపోయినా మంచి యాక్షన్ సినిమా..!