టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా.. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సెన్సేషనల్ డివోషనల్ హిట్ సినిమా హనుమాన్. మన తెలుగు నుంచి మొదటి సూపర్ హీరో సినిమాగా వచ్చిన హనుమాన్ సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాకు పోటీగా ఈనెల 12న థియేటర్లలోకి వచ్చింది. సినిమా రిలీజ్ టైంలో థియేటర్లో ఇవ్వకపోవడంతో హనుమాన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.
అయితే సినిమాకు తొలి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. అక్కడ నుంచి హనుమాన్ మూడో వారంలోకి ఎంటర్ అయినా ఈ సినిమా రేజ్ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గలేదు. రోజురోజుకు వసూళ్లు మరింత స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక నైజాం మార్కెట్లో హనుమాన్ తన మాసీవ్ రన్ కొనసాగిస్తోంది. మొత్తం 14 రోజుల రన్ కంప్లీట్ చేసుకున్న హనుమాన్ సినిమాకు నైజాంలో 9027 షోలు పడ్డాయి. మొత్తం 25,983 మంది ప్రేక్షకులు ఈ సినిమాని థియేటర్లలో వీక్షించారు.
14 రోజుల్లో 48. 62 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. జీఎస్టీ తో కలుపుకుని 29. 51 కోట్ల షేర్ అందుకోగా జిఎస్టి కాకుండా 25.01 షేర్ రాబట్టి భారీ సక్సెస్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను నైజాంలో మైత్రి మూవీ సంస్థ పంపిణీ చేసింది. మైత్రీ మూవీస్ వాళ్లు అక్కడ రైట్స్ 7 కోట్లకు సొంతం చేసుకోగా.. ఇప్పటికే దాదాపు 30 కోట్ల షేర్ వచ్చింది.
సినిమా ఎప్పటికీ స్ట్రాంగ్ గా ఉంది. మరో రెండు వారాలపాటు హనుమాన్ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనా నైజాంలో బాహుబలి 1, 2 – అల వై కుంఠపురంలో లాంటి భారీ బడ్జెట్.. పెద్ద సినిమాలతో పోల్చుకుంటే చిన్న సినిమాగా వచ్చి ఆ సినిమాల రేంజ్ లో వసూళ్లు కొల్లగొట్టడం అంటే హనుమాన్ మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయలేదని చెప్పాలి.