Movies' గుంటూరు కారం ' ... మ‌రీ ఓవ‌ర్ చేస్తున్నారు.. ఇలా...

‘ గుంటూరు కారం ‘ … మ‌రీ ఓవ‌ర్ చేస్తున్నారు.. ఇలా అయితే నిండా మునుగుతారు…!

నిర్మాత సూర్యదేవర నాగవంశీ కాస్త ఆవేశపరుడు అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఒక్కోసారి ఆయన ఆవేశంతో కూడిన వ్యాఖ్యలు చేస్తూ ఇటీవల కాలంలో కాంట్రవర్సీ అవుతున్నారు. తాజాగా గుంటూరు కారం సినిమా విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చకి వస్తున్నాయి. ఈ సినిమా విషయంలో ఆయన ధీమాగా ఉన్నారు. ఈ విషయంలో ఆయనను ఎవరు తప్పు పట్టరు. అయితే రాజమౌళి సినిమా కలెక్షన్లకు దగ్గరగా మా సినిమా కలెక్షన్లు ఉంటాయని చెబుతున్నారు. ఇది ఆయన మరోసారి ట్రోలింగ్‌కు గురికావడానికి కారణమైంది.

రాజమౌళి సినిమాలో అంటే మర్యాద రామన్న, ఈగ సినిమాల కలెక్షన్ లాగా ఉంటాయా అని కొందరు జోకులు వేస్తున్నారు. రాజమౌళి సినిమాలకు కలెక్షన్లు అంటే బాహుబలి 1,2, ఆర్‌ఆర్ఆర్ ఈ రేంజ్ కలెక్షన్లు ఉండాలంటే ముందు ఆరెంజ్ టికెట్ రేట్లు ఉండాలి.. సినిమాకు ఆ రేంజ్ లో హిట్ టాక్‌ రావాలి.. ఉత్తరాంధ్ర తీసుకుంటే ఆర్‌ఆర్ఆర్ సినిమాకు రూ.30 కోట్ల షేర్ వచ్చింది. బాహుబలి సిరీస్ కి కూడా ఇంచుమించు అలాగే కలెక్షన్లు వచ్చాయి. బన్నీ, త్రివిక్రమ్ అలవైకుంఠపురంలో సినిమాకు రూ.20 కోట్ల షేర్ వచ్చింది.

ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు ఉన్న టార్గెట్ ముందుగా అల వైకుంఠపురంలో సినిమా కలెక్షన్లు బీట్ చేయాలి. అల‌వైకుంఠ‌పురంలో సినిమా క‌ల‌క్ష‌న్‌లు చూపించే గుంటూరు కారం సినిమా అమ్మకాలు సాగించారు. వైజాగ్ ఏరియాలో హ‌క్కుల‌ను రూ.12 కోట్లకు అమ్మారు. అంటే ఖర్చులతో కలిపి కనీసం రూ.15 కోట్ల షేర్ రావాలి. సలార్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఉత్తరాంధ్రలో రూ.20 కోట్లకు అమ్మితే ఇప్పుడు రూ.10 కోట్లకు కాస్త అటు ఇటుగా ఆగింది. ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుకోవాలి. ఇది ఫ్యామిలీ సినిమా.

పండగ సీజన్ కనుక డబల్ షేర్ లాగుతుందని అనుకున్నా.. రూ.20 కోట్లు వస్తుంది. అంటే అలవైకుంఠపురం రేంజ్‌లో. మరి రాజమౌళి సినిమాలకు దగ్గరగా వెళ్ళాలి అంటే సాధ్యమేనా.. నిర్మాత నాగవంశీ మాత్రం ఓవ‌ర్‌ కాన్ఫిడెంట్‌తో ఈ మాటలు అంటున్నారా ? పై అంచనాలలో ఏ మాత్రం తేడా వచ్చినా గుంటూరు కారం నిండా ముంచేయడం ఖాయం. దీనికి తోడు ఈసారి సంక్రాంతి రేసులో ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఐదు సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. థియేటర్లు కూడా ఐదు సినిమాలు పంచుకోవాలి. ఇవన్నీ తెలిసి నాగవంశీ ఏ ధైర్యంతో ఈ కామెంట్లు చేస్తున్నాడు అన్నది సినిమా రిజ‌ల్ట్ వస్తే కానీ తెలియదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news