Movies' దేవ‌ర ' సినిమా మొత్తానికి ఆ ఇద్ద‌రి సీన్లే హైలెట్‌......

‘ దేవ‌ర ‘ సినిమా మొత్తానికి ఆ ఇద్ద‌రి సీన్లే హైలెట్‌… థియేట‌ర్ల‌లో అరుపులు.. కేక‌ల గోల‌…!

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున భారీ పాన్ ఇండియా సినిమా దేవర. ఏప్రిల్ 5న పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దేవరను రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేస్తున్నట్లు ద‌ర్శ‌కుడు కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్ ముద్దుగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి, జూనియర్ ఎన్టీఆర్ తాత నటరత్న ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

ఇప్పుడు శ్రీదేవి కుమార్తె, ఎన్టీఆర్ మనవడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవరపై అంచనాలు మామూలుగా లేవు. ఖచ్చితంగా ఈ జోడి తెలుగు తెర‌పై సంచ‌ల‌నం క్రియేట్ చేస్తుందని ప్రతి ఒక్కరూ అంచనాలతో ఉన్నారు. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు కొరటాల లాంగ్ షెడ్యూల్లో ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ శ‌రవేగంగా జరుగుతుంది. సినిమాలో ఎన్టీఆర్ లుక్‌ అదిరిపోతుందని అందుకు తగినట్టుగానే.. తన పాత్ర కోసం తారక్‌ కూడా డిఫరెంట్ మేకోవ‌ర్‌ ట్రై చేసినట్టు తెలుస్తోంది.

ఇక సినిమాలో ఎన్టీఆర్, విలన్ సైఫ్ అలీఖాన్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలవబోతున్నాయని తెలుస్తోంది. వీరిద్దరి ముఖాముఖి సీన్ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో ఉంటుందని.. ఆ సీన్ సినిమాకి హైలైట్ గా ఉండడంతో పాటు.. థియేటర్లలో గూస్‌బంప్స్‌ మోత మోగించేస్తుందని చెబుతున్నారు. సెకండ్ ఆఫ్‌లో కూడా సైఫ్‌, ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్‌లే దేవర సినిమాకు హైలెట్‌గా నిలవబోతున్నాయట. ఈ యాక్షన్ సీక్వెన్స్ కు థియేటర్‌లో విజిల్స్, కేకలు, అరుపులు మామూలుగా ఉండవని దేవర యూనిట్ ద్వారా లీక్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news