టాలీవుడ్ అగ్ర దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ రేంజ్లో అంచనాలు అందుకోలేదు. సినిమాకు తొలి షో నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది.
అయితే మహేష్ అభిమానులతో పాటు సగటు సినీ అభిమానులు మాత్రం కథ, కథనాలతో సంబంధం లేకుండా మహేష్‌బాబు కోసం ఈ సినిమాను చూస్తున్నారు. మహేష్‌బాబు తర్వాత రాజమౌళితో సినిమా చేస్తున్నారు. మరో రెండున్నరేళ్ల వరకు తెరమీద కనిపించే ఛాన్స్ లేదు. ఈ క్రమంలోనే కేవలం మహేష్‌బాబు కోసమే ఈ సినిమా చూస్తుండడంతో వసూళ్లు మాత్రం ఆగడం లేదు.
దీనికి తోడు పండగ సెలవులు పెంచడంతో గుంటూరు కారం బాక్సాఫీస్‌ను షేక్ చేసి పడేసింది. దీంతో గుంటూరు కారం వారం రోజుల్లోనే రు. 200 కోట్ల గ్రాస్ వసూళ్లతో సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఓ రీజనల్ సినిమా.. అది కూడా మిక్స్‌డ్ టాక్‌తో వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రు. 200 కోట్లు కొల్లగొట్టడం అనేది మామూలు విషయం కాదు. గుంటూరు కారంకు ఇప్పటికే రు. 100 కోట్లకు పైగా షేర్ వచ్చినా.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రు. 135 + కోట్ల రేంజ్‌లో ఉంది.
ఓ రీజనల్ సినిమాకు మిక్స్‌డ్ టాక్‌తో ఈ రేంజ్‌లో వసూళ్లు ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డుగా నిలిచింది. ఏరియాల వారీగా గుంటూరు కారం 10 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి.
ఏపీ & నైజాం : 173 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: 24 కోట్లు
ఓవర్సీస్ : 34 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 231కోట్లు