ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో మనల్ని పలకరించాడు. అదేవిధంగా తేజ సజ్జ హనుమాన్ సినిమాతో మనల్ని పలకరించాడు . రెండు సినిమాలు బాగానే ఉన్నాయి. కానీ జనాలకు ఎక్కువగా హనుమాన్ సినిమా నచ్చింది. బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం కొన్ని నెగటివ్ కామెంట్స్ వినిపించాయి.
సినిమాలో పెద్దగా మ్యాటర్ లేదు అంటూ ట్రోల్ చేశారు . ఇదే వ్యాఖ్యలపై ఇదే కామెంట్స్ పై దిల్ రాజు స్పందించారు . “గుంటూరు కారం సినిమాపై నెగటివ్ టాక్ కూడా వినిపిస్తుంది . కొందరు పాజిటివ్గా స్పందిస్తున్నారు. మనం సినిమా బాగోలేదు బాగోలేదు అని థియేటర్ కి వెళ్లి చూస్తే ఖచ్చితంగా సినిమా నచ్చదు ..సినిమా బాగుందంట కదా అని మనసులో పెట్టుకొని వెళ్లి చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది”.
” ఎవరో సినిమాకి నెగిటివ్ టాక్ క్రియేట్ చేసి పెట్టి అది స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు . సినిమా బాగుంటే ఎవ్వరు ఎవ్వరిని ఆపలేరు .. అది ఏ సినిమా అయినా సరే మా సినిమా బాగుంది నేను పర్సనల్గా అందరిని కాల్ చేసి కనుక్కున్నాను ..సినిమాలో కొన్ని నెగటివ్స్ ఉన్నాయి ఒప్పుకుంటున్నాం.. కానీ మహేష్ బాబు ఈ సినిమా కోసం కష్టపడిన తీరు అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది ..సినిమా చాలా బాగుంది.. కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి సినిమా రిజల్ట్ పట్ల సంతోషంగా ఉన్నాము అంటూ ట్రోలర్స్ కు ఇచ్చి పడేసాడు”..!!