ఎవరైనా సరే ..ఏ తండ్రి అయినా సరే తన కొడుకు భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటారు. అది సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రెటీస్ అయినా ఫార్మర్ అయిన .. కూలివాడైనా ..రిక్షావాడైన ఎవ్వరైనా సరే . అలాగే చిరంజీవి కూడా తన బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని చాలా చాలా తాపత్రయ పడ్డారు . అనుకున్న విధంగానే చరణ్ ని టాప్ ప్లేస్ లో నిల్చో బెట్టాడు . కాగా చిరంజీవి తన సినిమాల చూసింగ్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో మనకు తెలిసిందే.
కాగా తన కొడుకు విషయంలో కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉండడానికి ట్రై చేశారు . కానీ చరణ్ ఓ సినిమా విషయంలో మాత్రం చిరంజీవి మాట అస్సలు వినలేదు . “వద్దురా వద్దు నీకు ఆ సినిమా సెట్ కాదు సూట్ అవ్వదు జనాలకి నచ్చదు అని ..నెత్తి నోరు మొత్తుకున్నా కూడా ..నో అంటూ ఆ సినిమా చేసి బిగ్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు “.
ఆ సినిమా మరేదో కాదు “ఆరెంజ్”. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో రాంచరణ్ హీరోగా – జెనీలియా హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరమ చెత్త రికార్డులు క్రియేట్ చేసింది . ఈ సినిమా కారణంగా నాగబాబు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు అన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఈ సినిమా తరువాత చరణ్ పై నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి..!!