Moviesపనికిమాలిన డైరెక్టర్లకు అవకాశం ఇచ్చే చిరంజీవి.. ఆ ఒక్క డైరెక్టర్ కి...

పనికిమాలిన డైరెక్టర్లకు అవకాశం ఇచ్చే చిరంజీవి.. ఆ ఒక్క డైరెక్టర్ కి ఒక్క ఛాన్స్ ఇస్తే .. మరో ఠాగూర్ లాంటి హిట్ అందుకుంటాడుగా..!

చిరంజీవి .. టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దదిక్కులా.. వ్యవహరిస్తున్నారు. ఎటువంటి సపోర్ట్ లేకుండా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా వచ్చిన తర్వాత అవకాశాలు అందుకొని స్టార్ హీరోగా మారి మెగాస్టార్ గా మెప్పించి .. తన పేరు చెప్పుకొని మరి కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చేలా చేసుకున్నాడు. అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మందే ఉంటారు. కాగా ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి హిట్ల కోసం తాపత్రయ పడిపోతున్నారు.

“పక్కాగా చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి తన స్థాయి హిట్ అందుకోలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ ఆయనకు ఒక డైరెక్టర్ పేరు సజెస్ట్ చేస్తున్నారు. అందరు హీరోలకి అందరు డైరెక్టర్లకి అవకాశం ఇచ్చే నువ్వు .. సందీప్ రెడ్డి వంగాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నీ పేరు మారుమ్రోగిపోతుందని .. పైగా ఆయన నీ ఫ్యాన్ కావడంతో నీపై ఇంకా ఆయనకు మంచి గ్రిప్ దొరుకుతుందని ..

నువ్వు ఏ సినిమాలో ఏ షర్ట్ వేసుకున్నావో కూడా ఆయన చెప్పేస్తున్నాడని .. నువ్వంటే సందీప్ రెడ్డివంగాకు అంత పిచ్చి అని .. దయచేసి ఒక్క ఛాన్స్ సందీప్ రెడ్డివంగాకు ఇవ్వు మెగాస్టార్ అంటూ చిరంజీవికి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు “. అంతేకాదు చిరంజీవి హీరోగా సందీప్ రెడ్డి వంగ ఒక సినిమాను డైరెక్ట్ చేస్తే కచ్చితంగా ఠాగూర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ చిరంజీవి ఖాతాలో పడడం ఖాయం అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news