సినిమా ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసుకున్న రోల్ ని మరొకరు చేస్తూ ఉండడం సర్వసాధారణం . చాలామంది సెలబ్రిటీస్ ని ఇలా మంచి మంచి స్టోరీస్ ని మిస్ చేసుకున్న వాళ్లను చూసాం. అయితే రీసెంట్గా మెగా డాటర్ నిహారిక బయటపెట్టిన విషయం ఇప్పుడు అభిమానులకు కూడా షాకింగ్ గా ఉంది . ఇంత మంచి ఛాన్స్ ఎలా మిస్ అయిపోయావు అంటూ బాధ పడిపోతున్నారు. నిజానికి నిహారిక పుట్టగానే ఒక బిగ్ ప్రాజెక్టులో భాగం కావాల్సి ఉండిందట .
నిహారిక పుట్టిన తర్వాత సిసింద్రీ సినిమా షూట్ ను ప్రారంభించారు . ఈ సినిమా టైమ్ లో మేకర్స్ ఒక పాప గానీ బాబు గానీ పాకుతూ ఉండే స్టేజ్లో బేబీ కావాలి అంటూ బాగా ఎక్కువగా ట్రై చేశారట. స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు అయితే సినిమాకి మరింత హైప్ వస్తుంది అంటూ అలాంటి వాళ్ల కోసం ట్రై చేశారట . అప్పటికే నిహారిక కు 8 నెలలు దాటిపోయాయి . జనరల్ గా ఎనిమిది నెలలు దాటేసరికి పిల్లలు పాకుతూ ఉంటారు . కానీ నిహారిక టూ యాక్టివ్.. ఎనిమిది నెలలకు గోడ పట్టుకొని ఏకంగా నడిచేసేదట .
అయితే సిసింద్రీ సినిమాకి అంత యాక్టివ్ గా ఉన్న పాప అవసరం లేదని పాకుతూ ఉన్నటువంటి బేబీనే కావాలి అని ట్రై చేశారట . అప్పుడే అక్కినేని నాగార్జునకు అఖిల్ పుట్టడం .. అఖిల్ ఈ పాత్రకు కరెక్ట్ గా సరిపోవడంతో మేకర్స్ అఖిల్ ను చూస్ చేసుకున్నారట . అలా సిసింద్రీ సినిమా నిహారిక ఖాతాలో నుంచి అఖిల్ ఖాతాలోకి పడిపోయింది . ఒకవేళ నిజంగానే చిన్నప్పుడే నిహారిక ఆ రోల్లో కనిపించి ఉంటే నో డౌట్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయి ఉండేది .. ఈ డివర్స్ ల ట్రోలింగ్ కూడా ఉండేది కాదు అంటున్నారు మెగా అభిమానులు. ఏంటో నిహారిక టైం అస్సలు బాగాలేదు.. ఫస్ట్ నుంచి అన్ని వచ్చినట్లే వచ్చి చేయి జారిపోతున్నాయి అంటూ బాధపడిపోతున్నారు మెగా అభిమానులు..!!