Newsవామ్మొ..ఏంటి ఇది .. ఆఖరికి ఈ నాని గాడు కూడా నా..?

వామ్మొ..ఏంటి ఇది .. ఆఖరికి ఈ నాని గాడు కూడా నా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినిమాలను ప్రమోట్ చేసుకోవడం కోసం ఎంతకైనా తెగించేస్తున్నారు. ఎలాంటి పనులైనా చేస్తున్నారు . అయితే మొదటినుంచి టాలెంట్ ను కంటెంట్ ను నమ్ముకునే నాని తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ కొన్ని కొన్ని సార్లు పరోక్షకంగా తన సినిమాను హైలైట్ చేసుకోవడానికి కొందరి పేర్లని తన సినిమా ప్రమోషన్స్ లోకి లాగుతున్నాడు .

నిన్న కాకమొన్న హాయ్ నాన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ..రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ పర్సనల్ ఫోటోను టెలికాస్ట్ చేసి సినిమాకి 90% హైప్ ని క్రియేట్ చేసుకున్నారు. అయితే రీసెంట్గా సినీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”మెగాస్టార్ ని మధ్యలోకి లాగుతూ ఆయనపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . హోస్టు ప్రశ్నిస్తూ “దసరా సినిమా తర్వాత అలాంటి మాస్ సినిమా ఎందుకు చూస్ చేసుకోలేదు ..? ” అంటూ ప్రశ్నిస్తాడు .

అయితే వెంటనే నాని “చిరంజీవి గారు ఖైదీ సినిమా తర్వాత కేవలం మాస్ సినిమాల్లో నటించి ఉంటే చిరంజీవి గారు మెగాస్టార్ స్టేటస్ ని అందుకునేవాడా..? అంటూ ఆయన్ను ఆయన సినిమా ప్రమోషన్స్ లోకి లాక్కొచ్చారు”. దీంతో కొందరు మెగా ఫ్యాన్స్ నాని మాటలపై హ్యాపీగానే ఉన్న మరికొందరు మాత్రం నువ్వు నీ ప్రమోషన్స్ కి మెగాస్టార్ పేరుని వాడుకుంటున్నావా..? అంటున్నారు .

మరికొందరు మాత్రం నువ్వు నందమూరి బాలయ్య ఫ్యాన్ కదా..? మరి ఆయన్ని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు కదా ..? ఎందుకు చిరంజీవి గారి పేరు చెప్తున్నావ్ ..? అంటూ కావాలని నానిను ట్రోల్ చేస్తున్నారు . మరి కొంతమంది అందరూ మెగా ఫ్యామిలీనే వాడుకుంటున్నారు ..ఆఖరికి నాని గాడు కూడా వాడుకుంటున్నాడు.. అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news