Movies"షూట్ లో ఎన్టీఆర్ ఉంటే ఖచ్చితంగా అదే చేస్తాం".. నందమూరి ఫ్యాన్స్...

“షూట్ లో ఎన్టీఆర్ ఉంటే ఖచ్చితంగా అదే చేస్తాం”.. నందమూరి ఫ్యాన్స్ కి నవ్వు తెప్పిస్తున్న జాన్వీ కపూర్ కామెంట్స్ ..!!

అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ప్రెసెంట్ తెలుగులో కూడా డెబ్యూ ఇస్తుంది. ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో ఆమె హీరోయిన్గా సెలెక్ట్ అయింది . ఈ సినిమాకి సంబంధించిన సగభాగం షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది . ఎన్టీఆర్ – జాన్వి పై మంచి మంచి సీన్స్ చిత్రీకరించారు . అంతేకాదు జాన్వీ కపూర్ ఈ సినిమా ద్వారా మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంటుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ క్రమంలోనే రీసెంట్గా జాన్వి బాలీవుడ్ మీడియాలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ని ఓ రేంజ్ లో పొగిడేసింది . “టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ది నెంబర్ వన్ హీరో అని ..ఆయనలోని మంచితనం నాకు బాగా నచ్చేసింది అని .. లేడీస్ పట్ల స్పెషల్ రెస్పెక్ట్ చూపిస్తాడు అని ఓపెన్ గా చెప్పుకొచ్చింది”. అంతేకాదు “దేవరా షూట్ లో ఆయన లేకపోతే అస్సలు షూట్ చేయబుద్ధి కాదని .. తారక్ తో కలిసి నటించే సీన్స్ ఎంత హై ఆక్టివ్ లో చేస్తానో.. ఆయన లేకుండా సీన్స్ చేయమంటే అంత నిరాశగా చేస్తానని “..

“రీసెంట్గా దేవర సెట్స్ లో నాపై కొన్ని సీన్స్ చిత్రీకరించారని .. ఆ టైంలో ఎన్టీఆర్ నా పక్కన లేరని .. అప్పుడు చాలా చాలా మూడిగా ఆ సీన్స్ కంప్లీట్ చేశారని ” చెప్పుకొచ్చింది. అంతేకాదు ‘ దేవర సెట్స్ లో ఎన్టీఆర్ ఉంటే అసలు ఆ సెట్స్ ని వదలబుద్ధి కాదని .. ఆయన లేకపోతే మాత్రం ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా ..? అన్న ఫీలింగ్ కలుగుతుందని చెప్పి దేవరపై హైప్ పెంచేసింది”. అంతేకాదు తారక్ చాలా జోబియల్ పర్సన్ అని ..బాగా మాట్లాడుతాడని .. మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయామని కూడా చెప్పుకు వచ్చింది . దీంతో జాన్వి కపూర్ మాటలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news