Movies' స‌లార్ ' రిజ‌ల్ట్‌పై ఫ్యాన్స్‌లో క‌ల‌వ‌రం... వేణుస్వామి ఇంత దెబ్బ‌కొట్టాడేంటి...!

‘ స‌లార్ ‘ రిజ‌ల్ట్‌పై ఫ్యాన్స్‌లో క‌ల‌వ‌రం… వేణుస్వామి ఇంత దెబ్బ‌కొట్టాడేంటి…!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ పై సర్వత్రా అభిమానుల్లో సైతం నిరాశ కలుగుతుంది. తాజాగా సలార్ రిజల్ట్ పై ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కలకలం రేపుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ అభిమానుల ఆశలు అన్ని సినిమా మీదే ఉన్నాయి.

పైగా కేజీఎఫ్ సీరియస్ సినిమాలతో ప్రశాంత్ నీల్ దేశవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయ్యాడు. ప్రశాంత్‌నీల్ – ప్రభాస్ కాంబినేషన్ కావడంతో సలార్ కచ్చితంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొడుతుందని ప్రభాస్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. ఈ ట్రైలర్లో ప్రభాస్ కనిపించిన తీరు.. ఆయన డైలాగులు చూశాక అభిమానులకే నీరసం వచ్చేసింది. ప్రభాస్ ఏంటి ఇలా కనిపించడం ఏంటి ? అన్న డైల‌మాలో పడ్డారు.

సలార్ పై నెగిటివ్ టాక్ అప్పుడే ప్రారంభమైంది. ట్రైల‌రే ఇలా ఉంటే సినిమా డౌటే అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణుస్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. గతంలో వేణుస్వామి చెప్పిందే ఇప్పుడు నిజం కాబోతుందా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. వేణుస్వామి గతంలో కొందరు సెలబ్రిటీలపై చేసిన వ్యాఖ్యలు అన్ని నిజం అయ్యాయి. ఇప్పుడు సలార్ పై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు అభిమానులను తీవ్రంగా నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి.

ఆదిపురుష్‌, రాధేశ్యామ్ టైంలో రెండు సినిమాలు ప్లాప్ అవుతాయని వేణుస్వామి చెప్పిందే జరిగింది. ఇప్పుడు వేణుస్వామి కూడా స‌లార్ హిట్ అవ్వ‌డం క‌ష్ట‌మ‌ని.. ప్ర‌భాస్‌కు మ‌రో ప్లాప్ త‌ప్ప‌ద‌న్న‌ట్టుగా చెప్పిన మాట‌లు బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌భాస్ అభిమానుల్లో టెన్ష‌న్ మొద‌లైంది. మ‌రి ప్ర‌భాస్ వేణుస్వామి జాత‌కాన్ని బ్రేక్ చేస్తాడా ? లేదా త‌న ఖాతాలో వ‌రుస‌గా మ‌రో ప్లాప్ వేసుకుంటాడా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news