హీరోయిన్ సదా పేరు చెబితే సౌత్ ఇండియాలోనే గుర్తుపట్టని సినీ అభిమానులు ఉండరు. సదా తెలుగులో నితిన్ హీరోగా వచ్చిన తొలి సినిమా జయంతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ సినిమా దర్శకుడు తేజ సొంత బ్యానర్ అయిన చిత్రం మూవీస్ పతాకంపై తెరకెక్కింది. ఈ సినిమాకు తేజ దర్శకుడు.. హీరోగా నితిన్ ఇదే తొలి సినిమా. ఉదయ్ కిరణ్ శ్రీరామ్ సినిమాకు పోటీగా వచ్చిన జయం బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది.
అప్పట్లో యువతను ఈ సినిమా ఉర్రూతలూగించేసింది. వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ సదా తన మేనరిజంలో చెప్పిన డైలాగ్ కు యువత ఫిధా అయిపోయారు.అటు సదాకు కూడా ఇదే తొలి సినిమా.. అప్పట్లో తేజ హీరోయిన్లను బాగా సతాయించేవాడు. తాను దర్శకత్వం వహించిన సినిమాలకు కొత్త హీరోలు, హీరోయిన్లనే ఎక్కువగా పెట్టుకునేవారు. వాళ్లకు ఆయనే స్వయంగా నటనలో శిక్షణ ఇచ్చేవారు. సినిమాలో కొన్ని సీన్లలో నటిస్తున్నప్పుడు ఎవరైనా హీరో, హీరోయిన్ సరైన ఎక్స్ప్రెషన్లు ఇవ్వకపోతే తేజ వాళ్లపై కోప్పడడంతో పాటు.. కొన్ని సందర్భాల్లో చేయి కూడా చేసుకునేవారన్న ఆరోపణలు, ప్రచారం గట్టిగా ఉండేది.
ఈ క్రమంలోనే జయం సినిమాలో అడవిలో షూట్ చేస్తున్న కొన్ని సీన్లలో సదా నుంచి తాను అనుకున్న ఎక్స్‌ప్రెషన్‌లు రాకపోవడంతో తేజ బాగా సీరియస్ అవడంతో పాటు.. చివరకు ఒకానొక దశలో సహనం కోల్పోయి సదాపై చేయి చేసుకున్నారు అన్న ప్రచారం బయటకు వచ్చింది. సదా ఏడస్తుంటే సెట్ నుంచి బయటకు పో అని కూడా అరిచాడట. అయితే అప్పట్లో ఇప్పుడున్నంత మీడియా, సోషల్ మీడియా లేకపోవడంతో పెద్దగా బయటకు రాలేదు.
సదాకు అది తొలి సినిమా కావటంతో తన కెరీర్ కోసం ఆమె కూడా దీనిని పెద్దగా హైలైట్ చేయలేదు. చాలా రోజుల తర్వాత తేజ తాను సదాపై కోప్పడిన విషయం నిజమే అంటూ ఒప్పుకున్నారు. తేజ పై అప్పట్లో హీరోయిన్లను బాగా సతాయిస్తాడు అన్న ప్రచారం గట్టిగా ఉండేది.. ఆ సినిమాలో సదా నటునకు మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ఆమె విక్రమ్ హీరోగా వచ్చిన అపరిచితుడు సినిమాలో.. శంకర్ దర్శకత్వంలో నటించి సౌత్‌లో మంచి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.