Newsమొగుడితో క‌లిసి అమెరికాలో సెటిలైపోతోన్న టాలీవుడ్ హీరోయిన్‌...!

మొగుడితో క‌లిసి అమెరికాలో సెటిలైపోతోన్న టాలీవుడ్ హీరోయిన్‌…!

గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ లో పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. తన సన్న నడుముతో ప్రేక్షకులకు మతులు పోగొట్టేసింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా పరిచయం అయిన దేవదాసు సినిమాలో నటించిన ఈ అమ్మ‌డు చాలా తక్కువ టైంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టింది. ఒకానొక టైం లో స్టార్ డైరెక్టర్లు అందరూ.. త్రివిక్రమ్‌తో స‌హా వరుస పెట్టి తమ సినిమాలలో హీరోయిన్గా ఎడాపెడా వాడేసారు.

అయితే టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉండగానే ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిపోవాలని ఎంతో ట్రై చేసింది. అయితే బాలీవుడ్లో ఆమె ఆశలు అడియాసలు అయ్యాయి. ఆ తర్వాత ఆమె తెలుగులోకి తిరిగి వచ్చిన.. ఇక్కడ చాలామంది హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఇలియానా చాలా త్వరగా ఫేడ్ అవుట్ అయిపోయింది. దీనికి తోడు కాంట్రవర్సీ కామెంట్లతో పాటు.. డేటింగ్, ఎఫైర్లు పెట్టుకోవడంతో ఆమె ఫిజిక్‌లో కూడా బాగా మార్పు వచ్చేసింది. ఆమె లావెక్కిపోవ‌డంతో అస‌లు టాలీవుడ్ జ‌నాలు ఇలియానా వైపే చూడ‌లేదు.

ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్‌తో చాలా రోజులు పాటు డేటింగ్ చేసినా ఇలియానా అతడికి దూరమైంది. ఆ తర్వాత ఒకరిద్దరు హీరోలతో కూడా ఆమె ఎఫైర్లు నడిపినట్టు వార్తల్లోకి ఎక్కింది. రీసెంట్గా ఇలియానా ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఆమె సినిమాల్లోకి వస్తుందని వార్తలు వస్తున్నా. ఆమె కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయలేదని తెలుస్తోంది. అమెరికాకు చెందిన మైఖేల్ డోల‌న్‌ను.. ఇలియానా పెళ్లాడిన సంగతి తెలిసిందే.

గర్భం దాల్చిన తర్వాత ఆ విషయాన్ని ఆమె బయటకు చెప్పింది. అయితే ఇప్పుడు ఇలియానా ఇండియాని వదిలేసి భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే ఆమె ఓ వెబ్ సిరీస్‌లో నటించాల్సి ఉంది. అది కూడా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యే ఉద్దేశంలో ఉన్నట్టు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news