చిత్ర పరిశ్రమలోకి ప్రతీ ఒక్కరు ఓ కలతో వస్తారు. కలతో వచ్చిన కళాకారులకి ఆశించిన అవకాశాలు రాక పక్కదారి పడుతున్నారు. ఆడ మగ అనే తేడా లేదు. మగవారైతే అమ్మాయిలను మోసం చేయడం..దొంగతనాలకి పాల్పడటం లాంటివి చేస్తున్నారు. చిన్నా చితకా వేశాలు కూడా దొరక్క అల్లాడిపోతున్నారు. క్రవలం భోజనం కోసం అసిస్టెంట్ డైరెక్టర్స్ గా సినిమాకి జాయిన్ అయ్యేవారున్నారు.
ఇక అమ్మాయిల పరిస్థితైతే వర్ణనాతీతం. ఏమాత్రం అవగాహన లేకుండా ఇంట్లో చెప్పాపెట్టకుండా సినిమాలలో అవకాశాల కోసం వచ్చి నమ్మి మోసపోయి అవకాశాలిప్పిస్తామని చెప్పిన వాడి మాటలు నమ్మి వ్యభిచారం లోకి దిగుతున్నారు. ఒక్కసారి ఈ కూపంలోకి దిగిన తర్వాత తిరిగి ఇంటికెళ్ళి అమ్మానాన్నలకి మొహం చూపించలేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఇక నిజంగా హీరోయిన్ మెటీరియల్ అయిన వాళ్ళు కూడా సరైన ఆదరణ లేక వ్యాంప్ క్యారెక్టర్స్ చేసి అదే నిజ జీవితంలో కూడా చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని అసలు వాస్తవాలు తెలియక అందరూ బూతులు తిడుతుంటారు గానీ, కొందరు స్టార్ హీరోయిన్స్ కూడా చేయని సమాజ సేవ..పేదవాళ్ళని ఆదుకోవడం యూనిట్ సభ్యులలో చిన్న కుర్రాళ్ళకి ఆర్ధిక సహాయం చేయడం లాంటివి మంచి పనులు చేస్తుంటారు.
అలాంటి వారిలో నటి భువనేశ్వరి గురించి చెప్పుకోవాలి. తను హీరోయిన్ అవ్వాలనే ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ, తన ఫిజిక్..కళ్ళు చూసి వ్యాంప్ క్యారెక్టర్స్ కట్టబెట్టారు. దాంతో తన కల చెదిరింది. ఆశించినంతగా అవకాశాలు దక్కలేదు. రెండు సార్లు వ్యభిచారం చేస్తుందనే నెపంతో అరెస్ట్ చేశారు. కానీ, భువనేశవరీ చాలా మంచిదట. టీవీ సీరియల్స్ చేసినా సినిమాలు చేసినా అసిస్టెంట్ కుర్రాళ్లకి డబ్బు సహాయం చేయడం..బట్టలు కొనిపెట్టడం లాంటివి చేస్తుందట. సినిమాలలో చూసిన అందరికీ భువనేశ్వరి అంటే ఒకరకమైన అభిప్రాయం ఉంటే ఆమె వద్ద సహాయం పొందిన వారికి మాత్రం మరో అభిప్రాయం ఉంటుంది.