Newsరాజ‌మౌళీ ఇంట్లో ఏం జ‌రిగేది ఆ కుర్ర హీరోయిన్‌కి ఎలా తెలుస్తుంది..?

రాజ‌మౌళీ ఇంట్లో ఏం జ‌రిగేది ఆ కుర్ర హీరోయిన్‌కి ఎలా తెలుస్తుంది..?

టాలీవుడ్ దర్శక దీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. రాజమౌళి సినిమా అంటే రాజమౌళి కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. రాజమౌళి, రమా రాజమౌళి, రాజమౌళి తనయుడు కార్తికేయ, అటు కీరవాణి, కీరవాణి భార్య శ్రీవల్లి, కీరవాణి కుమారులు, ఇటు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఇలా మొత్తం అందరూ సినిమా కోసం సమష్టిగా కలిసి పనిచేసి సక్సెస్ కొడుతూ ఉంటారు. ఇక రాజమౌళి కుటుంబం ఒకే చోట ఉంటుంది. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, ఇటు కీరవాణి కుటుంబాలు కలిసి ఉంటాయి. పక్కపక్కనే ఉన్న వీరంతా ఒకే ఉమ్మడి కుటుంబంగా పనిచేస్తూ కలిసిమెలిసి ఉంటారు.

సినిమా షూటింగ్ జరిగినప్పుడు అయినా.. షూటింగ్ లేనప్పుడు అయినా కూడా.. ఈ ఇంట్లో ఎప్పుడూ ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అందరూ కలిసిమెలిసి భోజనం చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. బయట హోటల్స్‌కి వెళ్ళినా కూడా అన్ని కుటుంబాలు కలిసే వెళ‌తాయట. రాజమౌళి ఉండే ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్‌లోనే టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశి ఖ‌న్నా కూడా అద్దెకు ఉండేదట. ఆ కుటుంబం ఎంతో కలిసిమెలిసి ఆప్యాయతతో ఉంటుందని రాజమౌళి కుటుంబంలో అందరితోనూ తనకు మంచి పరిచయాలు ఉన్నాయని.. రాశి ఖ‌న్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

వాళ్ళు ఇంటి బయట ముగ్గులు వేస్తున్నప్పుడు తాను కూడా వెళ్లి సాయం చేసే దానిని అని.. ఆ కుటుంబంలో ఐక్యత చూస్తుంటే తనకు ఎంతో ముచ్చట వేసింది అని తనను కూడా ఆ ఫ్యామిలీ మెంబర్‌గా చూసుకునేవారని.. రాజమౌళి భార్య రమా, కీరవాణి భార్య శ్రీవల్లి ఎంతో గౌరవించడంతోపాటు ఆప్యాయతతో చూసుకునేవారని రాశిఖన్నా తెలిపింది. ఏదేమైనా రాజమౌళి కుటుంబం ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగా ఉంటూ కుటుంబ బంధాలకు విలువలు ఇస్తూ ఉంటుందని క్లియర్‌గా అర్థమ‌వుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news