Newsఈ బ్యూటీ అక్క‌, త‌ల్లి కూడా స్టార్ హీరోయిన్లే... లావెక్కిన కుర్ర...

ఈ బ్యూటీ అక్క‌, త‌ల్లి కూడా స్టార్ హీరోయిన్లే… లావెక్కిన కుర్ర హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా…!

పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఓ యంగ్ బ్యూటీ ఓ హీరోయిన్. అయితే లావెక్కిపోయింది. ఆమె తల్లి 1980 తెలుగుతో పాటు.. తమిళ సినిమా పరిశ్రమను ఒక ఊపు ఊపేసింది. అలాగే ఈ బ్యూటీ అక్క కూడా తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అమ్మ, అక్క బాటలో ఈ బ్యూటీ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఈ బ్యూటీ ని అస్సలు గుర్తుపట్టలేనట్టుగా మారిపోయింది. ఇంత‌కి ఆ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో కాదు తులసి.

తులసి తల్లి రాధా ఒకప్పుడు సౌత్ ఇండియాలో తిరుగులేని స్టార్ హీరోయిన్. అప్పట్లో ఆమె హాట్ హీరోయిన్ అన్న ఇమేజ్ తెచ్చుకుంది. రాధకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు కార్తీక. నాగచైతన్య.. జోష్ సినిమాతో హీరోయిన్ అయింది. అయితే జీవా హీరోగా వచ్చిన రంగం సినిమా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువ సినిమాలలో నటించింది. అయినా ఆమె స్టార్ హీరోయిన్ కాలేదు. రాధ రికమెండ్ చేసి మరి ఎన్టీఆర్ దమ్ము సినిమాలో కార్తీకను హీరోయిన్‌గా పెట్టించిన ఆ సినిమా కూడా సక్సెస్ కాలేదు.

ఇక తులసి మాత్రం అనుకోకుండా హీరోయిన్ అయింది. తులసికి నటన అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ సీనియ‌ర్ హీరోయిన్‌ సుహాసిని.. తులసిని చూసి మణిరత్నం తీస్తున్న సినిమాకు అడిషన్ ఇవ్వమని కోరింది. అలా కాదల్‌ మూవీతో తులసి హీరోయిన్ అయింది. ఇదే సినిమాను కడలి పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. రెండు భాషల్లోనూ ఈ సినిమా ఇంప్రెస్ చేయలేదు. ఆ తర్వాత తమిళంలో యాన్ అనే సినిమాలో కూడా తులసి నటించింది. దీన్ని తెలుగులో రంగం 2 పేరుతో రిలీజ్ చేశారు.

కానీ అస్సలు కలిసి రాలేదు. దీంతో తులసి పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. తాజాగా తన అక్క కార్తీక పెళ్లిలో తులసి కనిపించింది. చాలా బొద్దిగా మారిపోయింది. లావు ఎక్కి కనిపిస్తోంది. అసలు సోషల్ మీడియాలో ఆమెను ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు. తన అక్కను మించి మరీ ఆంటీ మాదిరిగా మారిపోయింది. తర్వాత ఆమె తులసి అని తెలిసి అందరూ షాక్ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news