Newsచిత్తుచిత్తుగా ఓడిపోయిన బీఆర్ఎస్.. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్న తెలుగు స్టార్...

చిత్తుచిత్తుగా ఓడిపోయిన బీఆర్ఎస్.. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్న తెలుగు స్టార్ హీరో..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న వార్త కూడా ఇట్లే ట్రెండ్ అయిపోతుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగ రీసెంట్గా తెలంగాణ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే . లెక్కింపు కూడా జరిగిపోయింది . కనీ విని ఎరుగని రేంజ్ లో ఎవ్వరు ఊహించని విధంగా బీఆర్ఎస్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది

అసలు అడ్రస్ గల్లంతయింది అనుకున్న కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ ఓడిపోవడం బీఆర్ఎస్ అభిమానులకు షాకింగ్ గా ఉంది . పోలింగ్ జరిగిన సమయంలో ఎలక్షన్స్ ఓట్ల లెక్కింపు కి 10 గంటల ముందుకు కూడా కేసీఆర్ అధికారం చేపట్టబోయేది మేమే అంటూ ధీమా వ్యక్తం చేశారు . కానీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయిన కేవలం నాలుగు అంటే నాలుగు గంటలకే సీన్ మారిపోయింది .

ప్రతి చోట బీఆర్ఎస్ వెనుకంజ లో ఉండడం .. కాంగ్రెస్ గెలుపుకు దగ్గరగా ఉండడంతో బీఆర్ఎస్ వాళ్లు కూడా తమ ఓటమి ఒప్పుకునేశారు . అయితే బిఆర్ఎస్ దారుణాతి దారుణంగా ఓడిపోవడం పట్ల తెలుగు హీరో చాలా చాలా ఆనందంగా ఉన్నారట . గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఓ హెల్ప్ కోసం కేసిఆర్ ని కలిస్తే ఆయన సినీ ఇండస్ట్రీ వాళ్ళని చాలా చులకనగా చూస్తూ దారుణంగా మాట్లాడరట .

కనీసం మర్యాద కూడా చేయకుండానే పంపించేసారట . దీనిపై తీవ్రంగా హర్ట్ అయిన ఆ హీరో ఆ పగను అలాగే పెంచుకున్నారు . ఇప్పుడు బీఆర్ఎస్ దారుణాతి దారుణంగా ఓడిపోవడంతో ఏకంగా ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి మరి పార్టీ చేసుకున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ సినీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news