News2024లో పెళ్లి పీట‌లెక్కుతోన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీళ్లే...!

2024లో పెళ్లి పీట‌లెక్కుతోన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

గ‌తేడాది లాగానే ఈ యేడాది కూడా సినీ సెల‌బ్రిటీల పెళ్లిళ్లు బాగానే జ‌రిగాయి. హీరోయిన్ కియిరా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా పెళ్లి జ‌రిగింది. అలాగే వ‌రుణ్ తేజ్ – లావ‌ణ్య త్రిపాఠి కూడా ఏడేళ్ల ప్రేమ బంధానికి పెళ్లితో ఫుల్‌స్టాప్ పెట్టేశారు. వీరిద్ద‌రి పెళ్లి ఈ యేడాది టాలీవుడ్‌కే హైలెట్ అని చెప్పాలి. మొత్తానికి ఈ సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి మెగా కోడలు అయిపోయింది.

ఇక యంగ్ హీరో శ‌ర్వానంద్ కూడా పొలిటిక‌ల్ ఫ్యామిలీకి చెందిన ర‌క్షితారెడ్డిని పెళ్లాడారు. ఆమె ఏపీకి చెందిన మాజీమంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణా రెడ్డి మ‌న‌వ‌రాలు కావ‌డం విశేషం. బాలీవుడ్ హీరోయిన్ ప‌రిణితీ చోప్రా ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాను పెళ్లాడింది. ఇక ఇలియానా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ త‌ర్వాత సీక్రెట్‌గా అత‌డిని పెళ్లాడింది. ఆమె ప్రియుడు, ఇప్పుడు భ‌ర్త అయిన వ్య‌క్తి పేరు మైఖేల్ డోల‌న్‌.హీరోయిన్ అమ‌లా పాల్ రెండో పెళ్లి చేసుకుంది. ప్రియుడు జ‌గ‌త్ దేశాయ్‌తో ఆమె

వేసింది. ఇక ద‌గ్గుబాటి హీరో అభిరామ్ బంధువుల అమ్మాయి ప్ర‌త్యూష చాప‌రాల‌ను పెళ్లాడాడ. హీరోయిన్లు కార్తీక‌, అతియాశెట్టి కూడా పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ స్వ‌ర‌భాస్క‌ర్ పెళ్లి కూడా కాస్త కాంట్ర‌వ‌ర్సీగా జ‌రిగింది. 60 ఏళ్ల వ‌య‌స్సులో ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నాడు.

ఇక సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, న‌టి ప‌విత్రా లోకేష్ కూడా త‌మ రిలేష‌న్ బంధాన్ని బ‌య‌ట పెట్టారు. ఇక వ‌చ్చే యేడాది కూడా కొంద‌రు హీరోయిన్ల పెళ్లిళ్లు జ‌ర‌గ‌నున్నాయి. వారిలో శృతీహాస‌న్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ ఉన్నారు. అలాగే త‌మ‌న్నా, ప్రియుడు విజ‌య్ వ‌ర్మ కూడా కొత్త యేడాదిలో పెళ్లి పీట‌లు ఎక్క‌వ‌చ్చు. అలాగే పాయ‌ల్ రాజ్‌పుత్‌, అవికాగోర్ కూడా ఈ యేడాది పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news