సలార్ .. సలార్.. సలార్ ఇది జస్ట్ పేరు అనుకుంటే పొరపాటు . ఇది ఒక ప్రభంజనం . ఇది ఒక సెన్సేషన్ . ఇది ఒక అరాచకం . ఇలా ఎన్ని చెప్పుకున్న తక్కువే . నిన్న మొన్నటి వరకు సలార్ సినిమా అంటే ఏదో ప్రభాస్ నటిస్తున్న సినిమా అని అనుకున్నారు. కానీ సినిమాలో ఇంత కథ ఉంది .. ఇంత కంటెంట్ ఉంది అందుకే ఇన్ని సంవత్సరాలు కష్టపడి ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు అన్న విషయం కొద్దిసేపటి క్రితమే తెలిసింది .
కాగా భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసేస్తుంది. కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన సలార్ సినిమాను చూసిన ప్రభాస్ అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు . ప్రభాస్ బాహుబలి తర్వాత ఎలాంటి హిట్ కొట్టాలి అనుకున్నాడో.. అలాంటి హిట్ కొట్టేలా చేశాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటించిన ఫ్రెండ్ క్యారెక్టర్ లో పృథ్వీరాజ్ నటించారు.
కీలక విలన్ పాత్రలో జగపతిబాబు కనిపించారు. సినిమాలో ఎంతమంది నటులు ఉన్నా సరే అందరి కంటికి ప్రభాస్ తప్పితే ఇంక ఎవరూ కనిపించరు. అంతలా ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తీసుకొచ్చారు. అయితే సినిమా ఎందుకు ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూడాలి అనడానికి ఐదు కారణాలు ఇప్పుడు ఎక్కడ చదివి తెలుసుకుందాం ..!!
1) బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా ఎన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన సలార్ సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరు .
2) ఆ సీన్స్ ఎలివేషన్స్ ఇంట్లో టీవీలో కూర్చొని చూస్తే ఆ కిక్కు రాదు .కచ్చితంగా పెద్ద స్క్రీన్ అయిన థియేటర్లో ఆ సౌండ్ డిటిఎస్ బాక్స్ లోనే వినాలి.
3) ఇంట్లో ఒక్కరే కూర్చొని పాప్ కార్న్ తింటూ ఎంజాయ్ చేయడం కన్నా సినిమా హాల్లో వందలాది మంది ఫ్యాన్స్ మధ్య కూర్చొని ఒక్కొక్క సీన్ కి అరుస్తూ కేకలు వేస్తూ చూస్తే వచ్చే మజాకా వేరు అది అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది .
4) ప్రశాంత్ నీల్ రాసిన సీన్స్ అద్భుతానికి అద్భుతం. టీవీలో చూస్తే ఆ అద్భుతాలను ఎంజాయ్ చేయలేం. తెరపై మాత్రమే ఎంజాయ్ చేయగలము.
5) పైరసీ ఎంకరేజ్ చేయకుండా ఉండాలి అని ప్రభాస్ ఎప్పటినుంచో చెప్తున్నాడు .. నిజమైన ప్రభాస్ ఫ్యాన్ ఎవరైనా సరే థియేటర్ కి వెళ్లే సలార్ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు.