టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ తన పేరుకు తగ్గట్టే తన తరంలో ఎక్కువ హిట్స్ అందుకుని.. విక్టరీ
వెంకటేష్‌గా తెలుగు తెరను ఏలారు. వెంకటేష్ కాంట్రవర్సీలకు ఎప్పుడు ఆమడ దూరంలో ఉంటారు. ఎవరితోనూ దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ఇష్టపడరు. అలాగే ఆయన నోటి నుంచి మనం ఎప్పుడు కాంట్రవర్సీ పదాలు కూడా వినం. వెంకటేష్ తన కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. వెంకటేష్ కెరీర్‌లో ఎక్కువగా రీమేక్ సినిమాలే వచ్చాయి. ఒకప్పుడు రీమేక్ సినిమాలో రారాజుగా వెంకటేష్‌కు పేరు ఉండేది. తమిళంలో ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలలో ఆయన తెలుగులో నటించి సూపర్ హిట్లు కొడుతూ ఉండేవారు.
వెంకటేష్ హీరోగా.. రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కొండపల్లి రాజా. ఈ సినిమాలో మరో హీరోగా సుమన్ నటించారు. వెంకటేష్‌కు జోడిగా నగ్మా నటించింది. ఈ సినిమా రిలీజ్ ముందు కాంట్రవర్సీలో చిక్కుకుంది. కొండపల్లి రాజా సినిమా తమిళంలో రజనీకాంత్ హీరోగా నటించిన అన్నామలై సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఆ సినిమాను హిందీలో జితేంద్ర, శత్రుఘ్నసిన్హా హీరోలుగా నటించిన కుద్‌గజ్జ్ సినిమాకు రీమేక్. తర్వాత ఈ సినిమాను కృష్ణంరాజు, శరత్ బాబు హీరోలుగా ప్రాణ స్నేహితులు పేరుతో.. వి మధుసూదన్ రావు డైరెక్ట్ చేశారు.
ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళంలో.. శరత్ బాబుతో కలిసి అన్నామలైగా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. రజనీకాంత్ నటించిన అన్నామలై సినిమాను తెలుగులో బిర్లా రాముడిగా డబ్ చేసి రిలీజ్ చేశారు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ రవిరాజు పినిశెట్టి వెంకటేష్ ఈ సినిమాను అన్నామలైకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. అప్పట్లో ప్రాణ స్నేహితులు హీరో కృష్ణంరాజు.. ఈ సినిమా తెరకెక్కించడానికి అనుమతి తీసుకోలేదని కోర్టుకు వెళ్లారు.
దీంతో ఈ సినిమా రిలీజ్ పై కాంట్రవర్సీ ఏర్పడింది. చివరకు చిత్ర నిర్మాతలు.. ప్రాణ స్నేహితులు చిత్రం నిర్మాతలతో పాటు కృష్ణంరాజుతో సెటిల్ చేసుకోవడంతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయింది. ఈ సినిమా హిట్ అయ్యాక అదే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వెంకటేష్.. సరదా బుల్లోడు సినిమా చేస్తే అది డిజాస్టర్ అయింది. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో చంటి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చి ఆంధ్ర దేశాన్ని ఊపేసింది.