Movies"ట్రైలర్ లో ఉన్న ఆ డైలాగ్ సినిమాలో ఎందుకు లేపేసారు...

“ట్రైలర్ లో ఉన్న ఆ డైలాగ్ సినిమాలో ఎందుకు లేపేసారు ఏం..?” ప్రభాస్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన ప్రశాంత్ నీల్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్ షేక్ చేస్తుంది . సలార్ సినిమా రిలీజ్ అయింది . హిట్ కొట్టింది . ప్రభాస్ అభిమానులకు కడుపు నింపేసింది .అంతా ఓకే ..కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ము దులిపేసింది . బాహుబలి రికార్డులను బద్దలు కొట్టేసింది . అయితే సలార్ సినిమా చూసిన అభిమానులకు ఓ విషయంలో మాత్రం నిరాశ మిగిలింది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాలో టిన్యూ ఆనంద్ చెప్పిన డైలాగ్ బాగా పాపులారిటీ దక్కించుకుంది .

ట్రైలర్ మొత్తానికి ఈ డైలాగే హైలెట్ గా మారింది. అయితే ఈ డైలాగ్ ఎక్కడ వస్తుందో అంటూ 1000 కళ్ళతో ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశ మిగిలింది. సినిమాలో ఎక్కడా కూడా ఆ డైలాగ్ లేకపోవడం గమనార్హం. అసలు ఆ సీన్ ని క్రాప్ చేసేసేయడం అభిమానులకు ఊహించిన షాక్ ఇచ్చింది. అంత మంచి డైలాగ్ డెలివరీ ఉన్న సీన్లు ఎందుకు లేపేసారు..? కొంపతీసి ఆ డైలాగును పార్ట్ 2 లో పెట్టబోతున్నారా..? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .

ఏది ఏమైనాప్పటికీ అంత మంచి డైలాగ్ ఉన్న సీన్ ని లేపేయడం ఫ్యాన్స్ కు నిరాశ మిగిల్చింది, అయితే దీనిపై ప్రభాస్ లేక ప్రశాంత్ నీల్ స్పందిస్తేనే బాగుంటుంది అంటున్నారు అభిమానులు . మొత్తానికి అభిమానులు కూడా ఎక్స్ పెక్ట్ చేయనటువంటి రేంజ్ లో హిట్ కొట్టి దట్ ఈజ్ ప్రభాస్ అనిపించుకున్నాడు ఈ హీరో. చూద్దాం పార్ట్ 2 విషయంలో ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news