Newsమేకప్ వేయరు అని .."తండేల్" సినిమాలో సాయి పల్లవి పాత్రను మిస్...

మేకప్ వేయరు అని ..”తండేల్” సినిమాలో సాయి పల్లవి పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

అక్కినేని నాగచైతన్య మంచి జోష్ లో ఉన్నాడు . రీసెంట్ గానే దూత అనే వెబ్ సిరిస్ తో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఆ తర్వాత వెంటనే మంచి స్టోరీని పట్టేశాడు. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ చందూమొండేటి దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమాకి కమిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాకి తండేల్ అంటూ నామకరణం కూడా చేశారు . ఈ సినిమా నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు .

2018లో గుజరాత్ నుండి 21 మంది మత్స్యకారులు వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ చెరలో చిక్కుకుంటారు. అందులో ఉన్న ఓ ఆంధ్ర మత్స్యకారుడి కథ ఆధారంగా తెరకెక్కిన సినిమానే ఈ తండేల్. ఈ సినిమాలో నాగచైతన్య నాచురల్ లుక్స్ లో కనిపించడానికి చాలా కష్టపడుతున్నారు. సిక్స్ ప్యాక్ కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాడట . దీనికోసం స్పెషల్ డైట్ ..గంటలు గంటలు వర్కౌట్స్ చేస్తున్నారు .

అంతేకాదు ఈ సినిమాలో సాయి పల్లవి నటన కీలకంగా మారబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ సినిమాలో చాలా నేచురల్ లుక్స్ లో కనిపించబోతుంది సాయి పల్లవి . అయితే ఈ పాత్ర కోసం ముందుగా రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారట చందు . అయితే ఆమె సున్నితంగా ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట. లోటు బడ్జెట్ సినిమా కావడం ఒక రీజన్ అయితే.. ట్రాక్ రికార్డు లేని నాగచైతన్యతో నటించడం ఆమె రిస్క్ అనుకునింది . అంతేకాదు పుష్ప సినిమాలో నాచురల్ గా నటించి వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఇంకొక న్యాచురల్ పాత్రలో నటిస్తే ఆమె కెరియర్ దెబ్బతింటుంది అన్న కారణంగా ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట . దీంతో ఫాన్స్ తిట్టిపోస్తున్నారు. మంచి పాత్రను మిస్ చేసుకున్నావ్ ..నీ మొఖానికి యానిమల్ సినిమాలో ఆ బోల్డ్ క్యారెక్టర్ కరెక్ట్ అంటూ బూతులు తిడుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news