Newsఓరి దేవుడోయ్.. మన ప్రభాస్ ఏంటి ఇలా తయారైయాడు.. అంకుల్ కాదు...

ఓరి దేవుడోయ్.. మన ప్రభాస్ ఏంటి ఇలా తయారైయాడు.. అంకుల్ కాదు ముసలి తాతే..!!

మనకు తెలిసిందే నెట్ ఫిక్స్ సీఈవో టెడ్ సరండోస్ ఇండియాకు వచ్చారు. అంతేకాదు వచ్చిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరినీ వరుస పెట్టి కలుస్తున్నారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ ఇంట్లో లంచ్ చేసి సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ , నిర్మాతలు శోభు , విక్కిలతో కలిసి మాట్లాడిన పిక్స్ వైరల్ అయ్యాయి . అలాగే నిన్న నందమూరి ఫ్యామిలీను కలిసి ఎన్టీఆర్ ఇంట్లో లంచ్ చేసి ఎన్టీఆర్ – కళ్యాణ్రామ్ – కొరటాల శివతో ముచ్చటించారు .

ఆ తర్వాత అల్లు అర్జున్ – సుకుమార్ తో స్పెషల్ డిన్నర్ చేశారు . మైత్రి నిర్మాతలు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు . డి రామనాయుడు స్టూడియోలో .. రాజమౌళి – సురేష్ బాబు – రానా దుల్కర్ — మరికొందరు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు . రీసెంట్ గా నెట్ ఫిక్స్ సీఈవో టెడ్ సరండోస్.. కల్కి మూవీ సెట్స్ లో కనిపించారు. ప్రభాస్ నటిస్తున్న కల్కి షూటింగ్ సెట్లో కలిశారు . ఈ క్రమంలోనే ప్రభాస్ నిర్మాతలు ప్రియాంక – స్వప్న దత్ – డైరెక్టర్ నాగ్ అశ్విన్ వాళ్ళతో కలిసి ఫోటోలు దిగారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్నాళ్లుగా ఫోటోకి ఫోజులు ఇవ్వకుండా తప్పించుకుంటూ తిరిగిన ప్రభాస్ లుక్స్ పూర్తిగా మారిపోయాయి . బాగా ఏజ్డ్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు ఫుల్ గడ్డంతో మీసాలతో కళ్ళకు కళ్ళజోడుతో అచ్చం ఓల్డ్ మ్యాన్ లుక్స్ లో కనిపిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా తాత లా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఇదంతా కేవలం కల్కి సినిమా కోసమే వేసుకున్న గెటప్ అని .. ఒరిజినల్గా ప్రభాస్ వేరేగా ఉన్నారు అని .. ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్న కొంతమంది జనాలు వినట్లేదు . ప్రభాస్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . దీంతో ప్రభాస్ కి సంబంధించిన లుక్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news