పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ సిరీస్‌ల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ మోత మోగిస్తోంది. ఓపెనింగ్ వసూళ్ళతో పాటు.. ఎన్నో రికార్డులను బద్దలు కొడుతుంది. ప్రభాస్ మాస్ యాక్షన్ చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు పోటీపడి మరి థియేటర్లకు వెళుతున్నారు. కొందరు సినీ విమర్శకులు సలార్‌ను పర్ఫెక్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వర్ణిస్తుంటే.. మరికొందరు చిన్నచిన్న లోపాలు బయటపెడుతున్నారు.
ఇక ఇప్పుడు కేజిఎఫ్ 1,2. తాజాగా సలార్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్, మన టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి మధ్య పోలికలు వస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరు గొప్ప ? ఎవరిది పై చేయి ? అన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కన్నడ సినిమా పరిశ్రమను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళిన ఘనత కచ్చితంగా ప్రశాంత్ నీల్‌కే దక్కుతుంది. కేజిఎఫ్ 1,2, తాజాగా సలార్ సినిమాలతో కన్నడ సినీ ఇండస్ట్రీ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్‌కు అదిరిపోయే గుర్తింపు వచ్చింది. అయితే సినిమాలో పాత్రలను, కథను పరిచయం చేయటంలో ఇద్దరి మధ్య తేడా ఉంటుంది.
సినిమా రిలీజ్ ముందు కథ పాత్రలను.. ప్రేక్షకులకు చిన్నగా పరిచయం చేస్తే సినిమా కోసం ఆడియన్స్ ఫుల్ గా ప్రిపేర్ అవుతారు.. సినిమాలోని పాత్రలను పరిచయం చేయడం ద్వారా సినిమాపై సరైన రీతిలో అంచనాలను సెట్ చేస్తాడు రాజమౌళి. అయితే ప్రశాంత్ నీల్ పాత్రల పరిచయంలోను.. కథను చెప్పే విధానంలోనూ.. చాలా గందరగోళానికి గురైనట్టు ఉంటుంది. ఎక్కువగా ఎలివేషన్లను నమ్ముకుంటాడు. ఇంకా చెప్పాలంటే సలార్‌లో సరైన ఎమోషన్ పండించడంలో కూడా నీల్ విఫలమయ్యాడని చెప్పాలి. కేవలం ఎలివేషన్లు నమ్ముకుని ప్రశాంత్ నీల్ వరుసగా సక్సెస్‌లు కొడుతున్నాడు.
రాజమౌళి ఎమోషన్లు, ఎలివేషన్లు కూడా, అటు.. పాత్రలను పరిచయం చేసే విషయంలో కూడా తనదైన ముద్ర వేస్తాడు. బాహుబలి 1, 2 సినిమాలతో ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఏకంగా తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చేలా చేసిన ఘనత దక్కించుకున్నాడు. ఇలా ఇద్దరు గొప్ప దర్శకులు అయిన కథ చెప్పే విధానంలో ఇతర విషయాలలో ప్రశాంత్ నీల్ కంటే రాజమౌళి కచ్చితంగా ఎన్నోరెట్లు గొప్ప దర్శకుడు అని చెప్పాల్సిందే .