Newsతెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపుపై బొమ్మ‌బ్లాక్‌బ‌స్ట‌ర్ హింటూ నాని షాకింగ్ కామెంట్‌..!

తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపుపై బొమ్మ‌బ్లాక్‌బ‌స్ట‌ర్ హింటూ నాని షాకింగ్ కామెంట్‌..!

నేచురల్ స్టార్ నాని – మృణాల్‌ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్‌ దర్శకత్వం వహించిన సినిమా హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో నాని ఏమాత్రం గ్యాప్ లేకుండా ప్రెస్ మీట్‌లు, ఈవెంట్లు, సోషల్ మీడియా ఫాలోవర్లతో రీల్స్, ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

తాజాగా అభిమానులతో చిట్ చాట్ కూడా స్టార్ట్ చేశాడు. అభిమానులు అడిగిన ప్రతి ప్రశ్నకు తనదైన రీతిలో నాని సమాధానం చెప్పాడు. హాయ్ నాన్న సినిమా బోర్ కొట్టదు కదా అని ఒక నెటిజన్ ప్రశ్నిస్తే నిమిషం కూడా బోర్ కొట్టించదు అని చెప్పుకొచ్చాడు. దెబ్బ తగిలిన కన్ను ఎలా ఉంది ? అంటే ఆల్‌ సెట్ అని డైరెక్టర్ శౌర్యవ్‌తో ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే అతడు చాలా కాలం స్టార్ డైరెక్టర్ గా ఉంటాడు.. అని నాని చెప్పుకొచ్చాడు.

ఇక తెలంగాణలో ఓటు వేశారు కదా.. తెలంగాణ రిజల్ట్ గురించి చెప్పమని అడిగితే.. 10 ఏళ్లు బ్లాక్ బస్టర్ సినిమా చూశాం. థియేటర్లో సినిమా మారింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని తెలంగాణ ఎన్నికలపై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దసరా సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్ కొట్టిన నాని ఇప్పుడు హాయ్ నాన్న‌ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news