ఇప్పటివరకు పద్ధతి అంటే సుమ. సుమ అంటే పద్ధతి.. అని ఒక్కటే ప్రచారం. పద్ధతిలేని వాతావరణం కనకే ఆమె సినిమాలు చేయదు. ఆమె కూడా ఒకప్పుడు హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసింది. అయితే ఇప్పుడు సినిమా ఫంక్షన్లు తప్ప ఇంకేమీ చేయటం లేదు. ఎన్ని వందల ప్రోగ్రాములు చేసినా సరే ఒక్క పొల్లుమాట, ద్వందార్థపు మాట రానివ్వదు. తన నోటి నుంచి అయితే ఇటీవల కాలంలో ఆమె కూడా మాట తూలుతున్నట్టుగా అనిపిస్తోంది. మీడియాపై నోరు పారేసుకుని తర్వాత క్షమాపణ చెప్పింది. అయితే ఇప్పుడు సుమ పద్ధతి మొత్తం మడిచి ఇంట్లో పెట్టుకుని మొగుడు రాజీవ్‌ని కూడా మూలన కూర్చో పెట్టేసి అన్నింటికీ దిగజారిపోయినట్టు కనిపిస్తోంది.
తన కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్‌గమ్ సినిమా చూసిన వాళ్ళందరూ ఇప్పుడు అదే సందేహం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్‌తో అంతగా లిప్‌లాక్ ఏమిటి.. ఒక పాటంతా కిస్సులే. అవి పై పైన కిస్సులు కాదు మరీ ఓటిటి కంటెంట్ బాపతు ఘాటుకిస్సులు, హగ్గులు, రొమాన్స్ సీన్లు తన కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి ఇండస్ట్రిలో తన పరిచయాలు మొత్తం ఉపయోగించింది. కథ దగ్గర నుంచి.. సినిమా రిలీజ్ వరకు ఆమె మాటే చెల్లుబాటు అయ్యింది. ఈ విషయంలో తన మొగుడు రాజీవ్‌ను సైతం పక్కన పెట్టేసినట్టు ఉంది. అసలు రోషన్ కెరీర్ మీద రాజీవ్ మాట చెల్లుబాటు లేదు.
సుమ దగ్గరకు కూడా రానివ్వదు. మరి ఎంతో సాంప్రదాయం, పద్ధతి అన్న ప్రచారం ఉన్న సుమ.. కొడుకు డబ్యూ సినిమా అంటే ఎలా ఉండాలి. సుమకు ఏ మాత్రం సోయలేదు. ఇది రోషన్ సినిమా అనరు సుమ కొడుకు సినిమా అంటారు. యూత్ సినిమా అంటే ఈ సినిమా తీసిన దర్శకుడికి చాలా నీచమైన అభిప్రాయం ఉన్నట్టు ఉంది. నాలుగు కిస్సులు, నాలుగు హగ్గులు ఉంటే థియేటర్లకు యువత పొలోమంటూ వచ్చేస్తారు అన్న ఓ తప్పుడు అభిప్రాయంతో ఈ సినిమా తెరకెక్కిచ్చినట్టుగా ఉంది.
పైగా ఈ దిక్కుమాలిన సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడం.. దీనిని నేరుగా ఏదో ఓటీటీలోకి ఇచ్చేస్తే బాగుండేది. టీవీల్లో ప్రసారం కూడా వేస్ట్. మళ్ళీ ఫ్యామిలీ ప్రేక్షకులు ఇబ్బందులు పడతారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా దెబ్బకు సుమా తన ఇజ్జత్ మొత్తం కోల్పోయింది. ఆమెపై ఉన్న సాంప్రదాయం పద్ధతి ఇమేజ్ మొత్తం గల్లంతయింది. హీరోయిన్ మానస చౌదరి అయితే రోషన్ మూతిలో మూతి పెట్టి మరి నాకు వేసినట్టు ఉంది. సుమ ఇకపై అయినా తన కొడుకు సినిమాల విషయంలో మంచి కథలు ఎంపిక చేసుకుంటే.. అతడి కెరీర్ బాగుంటుంది.