Newsఆ స్టార్ హీరో పెళ్ళి చెడ‌గొటడ్డానికి ఎంతో ట్రై చేసిన సుహాసిని.....

ఆ స్టార్ హీరో పెళ్ళి చెడ‌గొటడ్డానికి ఎంతో ట్రై చేసిన సుహాసిని.. షాకింగ్ రీజ‌న్‌..!

టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ సుహాసిని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుహాసిని అంటే అచ్చ తెలుగు ఆడపడుచు. ఆమె నటించిన పాత్రలు కూడా అంతే సంప్రదాయంగా ఉంటాయి. తెలుగులో ఆమె తరం హీరోలు అందరితో కలిసి నటించి.. ఎన్నో సూపర్, డూపర్ హిట్లు కొట్టారు. ఆ తర్వాత ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నంను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో సెటిల్ అయ్యారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇది ఇలా ఉంటే సుహాసిని ఒక స్టార్ హీరో పెళ్లి చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు.

వినటానికి ఇది విచిత్రంగా ఉన్న నిజమే. సుహాసినికి ఆమె తరం తోటి నటి సుమలత మంచి స్నేహితురాలు. వీరిద్దరూ ఎంతో ఆప్యాయతతో ఉండేవారు. ఆ టైంలో సుమలత కన్నడ రెబల్ స్టార్ అయినా స్టార్ హీరో అంబరీష్‌తో ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని సుహాసినికి చెప్పారు. తాను అంబరీష్‌ను పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పగా సుహాసిని ఒక్కసారిగా షాక్ అయిపోయారట. అంబరీష్ అంటే ఒక రౌడీలా ఉంటాడు.. నువ్వు చాలా సాఫ్ట్.. మీ ఇద్దరికీ అస్సలు మ్యాచ్ కాదు.. నీ లైఫ్ ని నువ్వు నాశనం చేసుకోవద్దు.. దయచేసి అతడిని పెళ్లి చేసుకోకు అని ఎంతో బతిమిలాడిందట సుహాసిని.

సుమలత మాత్రం తాను అంబరీష్‌కు మాట ఇచ్చాను.. అతడినే పెళ్లి చేసుకుంటానని.. చెప్పింద‌ట‌. నీ చావు నువ్వు చావు.. అతడని పెళ్లి చేసుకుంటే నీ కెరీర్ నాశనం అయిపోతుంది.. అని బెదిరించిందట కూడా. చివరకు అంబరీష్ – సుమలత పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సుమలత ఈ విషయాన్ని అంబరీష్ చెవిలో వేసిందట. ఒకసారి బెంగళూరు వెళ్ళిన సుహాసిని.. సుమలత ఇంటికి వెళ్ళగా అప్పుడు అంబరీష్ ఏమ్మా నేను నీకు రౌడీలా కనిపించానా.. నీకు ఏం అన్యాయం చేశానని.. నా పెళ్లి చెడగొట్టటానికి ట్రై చేసావు అని సరదాగా సుహాసినిని ఆటపట్టించారట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news