Newsశర్వానంద్ కి బుర్ర ఉన్నా..ఆది మాత్రం లేదు..అందుకే ఇన్ని ఫ్లాపులు పడుతున్నాయా...?

శర్వానంద్ కి బుర్ర ఉన్నా..ఆది మాత్రం లేదు..అందుకే ఇన్ని ఫ్లాపులు పడుతున్నాయా…?

యంగ్ హీరో శర్వానంద్ కొన్ని సినిమాలకి బాగా సూటవుతాడు. కానీ, ఓవర్ థింకింగ్ వల్ల మంచి కథలను ఎంచుకోవడంలో తడబడి కెరీర్ ని తానే ఇబ్బందుల్లోకి నెట్టేసుకుంటున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినీస్తోంది. ఇదే శర్వానంద్ ప్రస్థానం, గమ్యం సినిమలౌ ఎంచుకున్నప్పుడు అందరూ మెచ్చుకున్నారు. అప్పుడున్న మెచ్యూరిటీ ఇప్పుడేమైందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఏ హీరోకైనా మాస్ ఇమేజ్ కావాలి. మన సౌత్ ఇండస్ట్రీలలో మాస్ ఆడియన్స్ ఎక్కువ. ఇక్కడున్న అన్నీ భాషలలో హీరోలకి మాస్ ఫ్యాన్స్ బేస్ అసాధారణం. అందుకే, సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత మాస్ గా ఉండాలో అంత మాస్ గా డిజైన్ చేస్తారు. మహేశ్ బాబు లాంటి పక్కా క్లాస్ హీరోను సైతం పక్కా మాస్ హీరోగా మార్చాలంటే అది ఒక్క పూరి జగన్నాద్ వల్లే సాధ్యమైంది.

కానీ, అలా మాస్ హీరోగా నిలబడటం ఆ తర్వాత కథలు ఆ హీరో కోసమే తయారవడం అంటే చాలా కష్టం. ప్రతీ నిర్మాత ఓ కథ విన్న తర్వాత హీరోని ఒకే చేసుకోవడం అతని మీద ఎంత బిజినెస్ అవుతుంది…గత చిత్రాల సక్సెస్..ఇలా అన్నీ బేరీజు వేసుకొని రంగంలోకి దిగుతాడు. అలాంటి ఇండస్ట్రీలో శర్వానంద్ తనకి సూటైన కథలని ఎంచుకోకుండా ప్రయోగాలు చేసి గట్టి దెబ్బలే తిన్నాడు.

శర్వా అంచనాలతో ఒప్పుకున్న పడి పడి లేచెమనసు, శ్రీకారం, మహా సముద్రం లాంటి సినిమాలు నెత్తిమీద గట్టి మొట్టికాయలు వేశాయి. ఇదే శర్వానంద్ మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు లాంటి డీసెంట్ కథ చేసినప్పుడు అందరూ ఆదరించారు. ఇప్పటికీ శర్వా కి మంచి మార్కెట్ ఉంది. కానీ, కథలే ఆయన సరిగ్గా ఎంచుకోవడం లేదు. దీనికి పెద్ద ఉదాహరణ మహా సముద్రం. హీరోలందరూ రిజెక్ట్ చేస్తే ఈయన మాత్రం ఆహా అని బోల్తా పడ్డాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news