సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ వివాదాలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. మరీ ముఖ్యంగా కొంతమంది బడా హీరోలు బడా ప్రొడ్యూసర్స్ కూడా ఈ వివాదాలలో ఇరుక్కుంటూ ఉండటం గమనార్హం. అయితే ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో పెద్దమనుషులుగా చెప్పుకుంటున్న హీరోలు ఈ క్యాస్టింగ్ కౌచ్ ను పట్టించుకోవడం లేదు అంటూ పలువురు క్యాస్టింగ్ కౌచ్ బాధితులు బాధపడిపోతున్నారు.
కాగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సీనియర్ పాత్రలు చేస్తుంది. అయితే ఈమె కూడా ఫస్ట్రేట్ అయిపోయి ఇండస్ట్రీలో జరిగే విషయాలను పెద్దలు పట్టించుకోవడం లేదు అని పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారని.. కళామతల్లినే నమ్ముకున్న మేము ఎలా బ్రతకాలి అని బాధపడిపోతున్నారు.
అంతేకాదు వయసు చూసుకోకుండా హీరోయిన్స్ తో ముద్దులు పెట్టుకునే ఈ హీరోలు ఇండస్ట్రీ పెద్దలా..? దాసరి నారాయణరావు గారు బ్రతికుంటే ఇండస్ట్రీకి ఇలాంటి దుస్థితి పట్టి ఉండేదే కాదు అంటూ ఆమె ఎమోషనల్ అయిపోయిందట . ఫ్రెండ్స్ వద్ద ఈ విషయాన్ని చెప్పుకొని ఆమె తెగ బాధపడిపోయిందట . పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోయిన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ లు ఇస్తున్నారని .. తెలుగు హీరోయిన్స్ కి తెలుగు యాక్టర్స్ ని అసలు పట్టించుకోవడం లేదు అని.. ఈ హీరోయిన్ నెత్తి నోరు మొత్తుకుంటున్న ఎవరూ కూడా వినడం లేదు..!!