టాలీవుడ్‌కు చెందిన యువ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్‌గా సూపర్ పాపులర్ అయిపోయాడు. అర్జున్‌రెడ్డి సినిమాతో సందీప్‌కు యూత్‌లో తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ అంతే పాపులర్ అయ్యాడు. ఇక తాజాగా రణబీర్‌సింగ్, రష్మిక జంటగా సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా అయితే సందీప్‌ను దేశవ్యాప్తంగా ఉన్న స్టార్, క్రేజీ డైరెక్టర్ల సరసన చేర్చేసింది.
ఇప్పుడు సందీప్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ స్టార్ హీరోలే క్యూలో ఉన్నారు. అయితే యానిమల్ సినిమాతో సందీప్ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి రెమ్యునరేషన్‌ను బీట్ చేసినట్టుగా తెలుస్తోంది. సందీప్ ఎప్పుడు అయితే బాలీవుడ్‌కు వెళ్లాడో అప్పుడే అమెరికాలో ఉంటోన్న తన సోదరుడు ప్రణయ్ రెడ్డిని ఇండియాకు రప్పించి తన సినిమాల నిర్మాణ వ్యవహారాలను చూసే బాధ్యతలు అప్పగించారు.
తాజా యానిమల్ సినిమాకు టీ సీరిస్ నిర్మాతలు అయినా కూడా ప్రణయే రెడ్డే నిర్మాణం అంతా చూసుకున్నారు. పైగా యానిమల్ సినిమాలో సందీప్ భాగస్వామి.. సగానికి సగం వాటాతో పాటు రెమ్యునరేషన్లు అన్ని కలుపుకుంటే ఏకంగా రు. 200 కోట్లు ముట్టినట్టు తెలుస్తోంది. నిజం చెప్పాలంటే ఇది రాజమౌళి సినిమాకు ఆయన ఫ్యామిలీ ప్యాక్‌కు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఎక్కువే అంటున్నారు.
కేవలం రెండు, మూడు సినిమాలకే రాజమౌళి టోటల్ ఫ్యామిలీ రెమ్యునరేషన్‌ను దాటేసే రేంజ్‌కు సందీప్ వంగా చేరుకోవడం అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. సందీప్ తర్వాత ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాకు రెడీ అవుతున్నాడు.