టాలీవుడ్ లో మంచి లక్కీ హీరోయిన్గా ఉన్న సంయుక్త మీనన్ షాకింగ్ డేసీషన్ తీసుకోబోతుందా? కెరీర్ పరంగా ఫామ్ లో ఉన్నప్పుడు ఆమె రాంగ్ స్టెప్ వేయబోతుందా ? అంటే ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ చాలా తక్కువ టైంలోనే టాలీవుడ్ లో మంచి పాపులర్ అయిపోయింది. తెలుగులో భీమ్లానాయక్, బింబిసారా, విరూపాక్ష, సర్ తాజాగా వస్తున్న కళ్యాణ్ రామ్ సినిమా డెవిల్ సినిమాలో నటించింది.
సంయుక్తకు తక్కువ టైంలో మంచి హిట్ సినిమాలు పడ్డాయి. పైగా మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కన్ను పడడంతో ఆమెకు ఛాన్సులు బాగా వచ్చాయి. ఆమె నటించిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ముఖ్యంగా మిడిల్ రేంజ్ హీరోలకు సంయుక్త మంచి ఆప్షన్ గా మారింది. అందంతోపాటు.. కావలసిన అభినయం కూడా ఉండడంతో మిడిల్ రేంజ్ హీరోలు మిడిల్ రేంజ్ నిర్మాతలు సంయుక్త వెంట పడుతున్నారు.
అయితే ఆమె త్వరలోనే పెళ్లి చేసుకుని సినిమాలుకు గుడ్ బై చెబుతున్నట్టు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ తో ఆమె నటించిన డెవిల్ సినిమా ఆమె లాస్ట్ సినిమా అవుతుందని టాక్ వినిపిస్తోంది. కేరళాకు చెందిన ఓ కుర్రాడుతో సంయుక్త ప్రేమలో పడిందని.. అతడు మరో మతానికి చెందిన కుర్రాడు కావడంతో తన పేరులో ఉన్న మీనన్ పేరు కూడా ఆమె వదిలేస్తుందని తెలుస్తోంది. తన పేరులో నుంచి మీనన్ తొలగించడానికి చాలా కారణం ఉందని గతంలో చెప్పింది ఈ అమ్మడు.
అయితే దానికి రీజన్ ఆమె మరో మతానికి చెందిన కుర్రాడి ప్రేమలో పడి.. అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉండటమే అని తెలుస్తోంది. మంచి పాత్రలలో కనిపించిన సంయుక్త మంచి క్రేజ్లో ఉండగానే.. ఆమె తన కెరీర్ నాశనం చేసుకుంటున్న చర్చలు నడుస్తున్నాయి. పెళ్లి తర్వాత కూడా ఆమె కెరీర్ కొనసాగిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.