Newsవైష్ణవి చైతన్య కు మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఇచ్చిన సమంత.. ఏ...

వైష్ణవి చైతన్య కు మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఇచ్చిన సమంత.. ఏ నక్క తోక తొక్కిందో..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు హీరోయిన్లు నటనపై కన్నా కూడా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలను నిర్మించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఆమె రీసెంట్గా “ట్రాలాల” అనే ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే . అయితే ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఆమె ఎక్కువగా టాలెంట్ ఉండి అవకాశాలు రాలేక మరుగున పడిపోయిన నట రత్నాలను బయటకు తవ్వే ప్రయత్నం చేస్తుందట .

ఈ క్రమంలో భాగంగా తన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే ఫస్ట్ సినిమాలో హీరోయిన్గా వైష్ణవి చైతన్యను చూస్ చేసుకుందట. బేబీ సినిమాతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయిన వైష్ణవి చైతన్య ప్రెసెంట్ ఆనంద్ దేవరకొండ తో ఓ సినిమా చేస్తుంది . అది తప్పిస్తే అమ్మడు ఖాతాలో పెద్దగా సినిమాలు లేవు. రీసెంట్ గానే ఓ ఐటెం సాంగ్ లో నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు రావట్లేదని టాలెంట్ ఉన్న పెద్ద హీరోల ఎంకరేజ్ చెయ్యట్లేదు అని ..భావించిన సమంత టాలెంట్ ఉన్న ఇలాంటి తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి స్టెప్ తీసుకుందట . అంతేకాదు హీరోలను కూడా బడా హీరోలు కాకుండా టాలెంట్ ఉన్న యంగ్ హీరోస్ ని చూస్ చేసుకుంటుందట . ఒక విధంగా చెప్పాలి అంటే సమంత సామాన్య జనాల మనసులను దోచేస్తుంది . చూడాలి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news