అక్కినేని హీరో నాగచైతన్యతో విడిపోయాక సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది స్టార్ హీరోయిన్ సమంత. ఇటీవల మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్న సమంత ఇప్పుడే ఆరోగ్యపరంగా కాస్త కుదుట పడుతోంది. ఈ టైంలో సమంత రెండో పెళ్లి చేసే ఆలోచనలో కూడా లేదనే చెప్పాలి. అయితే తన అభిమానులతో సోషల్ మీడియాలో సమంత ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది.
ఈ క్రమంలోనే ఓ నెటిజన్ రెండో పెళ్లి గురించి ఓ ప్రశ్న వేయడంతో పాటు ఓ డేటా కూడా షేర్ చేశాడు. కీ డైవర్స్ స్టాటిటిక్స్ అంటూ కొంత సమాచారం షేర్ చేశాడు. అందులో ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నప్పుడు విడాకుల రేటు 50 శాతం ఉందని.. రెండో సారి, మూడోసారి పెళ్లి ఆ రేటు మరింత పెరిగిందని ఉంది. దీన్ని చూస్తే మీకు మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా ? అని ప్రశ్నించాడు.
దీనిపై సమంత ఫన్నీగా ఆన్సర్ చేసింది. డేటా ప్రకారం చూస్తే వివాహం అనేది సరైన పెట్టుబడి కాదని పేర్కొంది. 2023 వరస్ట్ ఇయర్‌గా పేర్కొన్న సమంత వచ్చే యేడాది తన ప్రాధాన్యం అంతా ఆరోగ్యానికే అని చెప్పింది. ఇక రెండో పెళ్లిపై నాగచైతన్య కూడా సామ్ చెప్పినట్టుగానే స్పందించాడు. ధూత ప్రమోషన్లలో మాట్లాడుతూ ప్రస్తుతం తన ఆలోచనలు అన్నీ సినిమా మీదే ఉన్నాయని.. రెండో పెళ్లి గురించి ఆలోచించే టైం లేదని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక 2023 చైతుకు ధూత హిట్‌తో కాస్త రిలాక్స్ ఇస్తే… సామ్‌కు మాత్రం మంట పెట్టేసినట్టుగా ఆమె మాటలే చెపుతున్నాయి.