Moviesయూట్యూబ్‌ను షేక్ చేసిన ' స‌లార్ ' ట్రైల‌ర్‌... ఆల్ రికార్డ్స్‌...

యూట్యూబ్‌ను షేక్ చేసిన ‘ స‌లార్ ‘ ట్రైల‌ర్‌… ఆల్ రికార్డ్స్‌ బ్రేక్‌…!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కిన పాన్ ఇండియా సినిమా స‌లార్‌. దేశ‌వ్యాప్తంఆనే మోస్ట్ అవైటెడ్ సినిమాగా అంద‌రూ ఎదురు చూస్తోన్న స‌లార్ క్రిస్మ‌స్ కానుక‌గా ఈ నెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు పాన్ ఇండియా భాష‌ల‌లో రిలీజ్ అవుతోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన స‌లార్ సినిమా ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాను షేక్ చేసేసింది. యూట్యూబ్‌లో వీరంగం ఆడేసింది.

క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. స‌లార్ ట్రైల‌ర్ 24 గంట‌ల్లో ఏయే భాష‌ల్లో ఎలాంటి రికార్డులు బ్రేక్ చేసిందో చూశాం. స‌లార్ ట్రైల‌ర్ 24 గంట‌ల్లో క‌ళ్లు చెదిరే రీతిలో క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ‌, హిందీ భాష‌ల్లో క‌లుపుకుని 24 గంట‌ల్లో 120 + మిలియ‌న్ల వ్యూస్ ద‌క్కించుకుంది.

24 గంట‌ల్లో అత్య‌ధిక వ్యూస్ ద‌క్కించుకున్న ఇండియ‌న్ సినిమాగా స‌లార్ స‌రికొత్త రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో స‌ర్కారువారి పాట సినిమా ట్రైల‌ర్‌కు ఏకంగా 24 గంట‌ల్లో 26.77 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. అయితే ఇప్పుడు స‌లార్ ట్రైల‌ర్ ఆ రికార్డును కూడా బీట్ చేసేసింది. స‌లార్ తెలుగు ట్రైల‌ర్ 24 గంట‌ల్లో ఏకంగా 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించింది.

వివిధ లాంగ్వేజెస్‌లో స‌లార్ ట్రైల‌ర్‌కు 24 గంట‌ల్లో వ‌చ్చిన వ్యూస్ ఇలా ఉన్నాయి…
తెలుగు – 32. 6 మిలియ‌న్ల వ్యూస్ – 1.24 మిలియ‌న్ లైక్స్‌
హిందీ – 54. 3 మిలియ‌న్ల వ్యూస్ – 850 కే లైక్స్‌
త‌మిళంలో – 9.1 మిలియ‌న్ల వ్యూస్ – 226 కే లైక్స్‌
క‌న్న‌డంలో – 9.6 మిలియ‌న్ల వ్యూస్ – 215 కే లైక్స్‌

మ‌ళ‌యాళంలో – 7.7 మిలియ‌న్ల వ్యూస్ – 212కే లైక్స్‌

మొత్తం అన్ని భాష‌లు క‌లిపి = 120 + మిలియ‌న్ల వ్యూస్ – 2.7 + మిలియ‌న్ల లైక్స్‌

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news