సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరి ఏ హీరోయిన్ కి లేదనే చెప్పాలి . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో అందాలను ఆరబోయకుండా ఆఫర్స్ దక్కించుకుంటూ లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ దక్కించుకోవడం మామూలు విషయం కాదు . అలాంటి ఓ ఘనత అందుకుంది సాయి పల్లవి. ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దగుమ్మ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది .
అయితే సాయి పల్లవి తాను కొత్తగా కమిట్ అవుతున్న సినిమాలకు కొత్త కండిషన్స్ పెడుతుందట. సినిమాకు కమిట్ అవ్వాలి అంటే ముందుగానే వర్క్ షాప్ చేయాల్సిందే అంటూ చెబుతుందట . దీనివల్ల ఎలాంటి సీన్స్ ఎప్పుడు చేయాలి ..? ఎలా చేయాలనే..? విషయంలో గెటప్ లుక్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి అంటూ చెప్పుకొస్తుందట . అంతేకాదు సాయి పల్లవి తీసుకున్న నిర్ణయం కూడా మంచిది అంటున్నారు మేకర్స్ .
అందరూ హీరోయిన్స్ తమ సేఫ్ జోన్ కోసం కండిషన్స్ పెడితే .. సాయి పల్లవి సినిమా హిట్ అవ్వడానికి కండిషన్లు పెడుతుంది ఇది గ్రేట్ అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే సాయి పల్లవి తెలుగులో రెండు సినిమాలు..తమిళ్ లో రెండు సినిమాలకు కమిట్ అయ్యింది..అమ్మడి జోరు చూస్తుంటే రానున్న రోజుల్లో మంచి మంచి సినిమాలు వచ్చేలానే ఉన్నాయి..!!