శివ సినిమాతో నాగార్జునకి జీవిత కాలం స్టార్ డం తెచ్చిపెట్టాడు రాం గోపాల్ వర్మ. ఇండస్ట్రీ గురించి చెప్పుకోవాలంటే శివ సినిమాకి ముందు ఆ తర్వాత అనేంతగా ఊహించని మార్పులు తెచ్చారు వర్మ. ఆయన దర్శకత్వంలో సుమంత్ ని హీరోగా లాంచ్ చేయాలనుకున్నారు అక్కినేని ఫామిలీ. ఆ క్రమంలోనే ప్రేమ కథ సినిమాను ప్రకటించారు.
సుమంత్ హీరోగా అంటే ఆర్జీవీ నాగార్జున లా చాలా ఈజీగా ఢీల్ చేయవచ్చునని భావించారు. కానీ, సుమంత్ ఎంత డమ్మీగా ఉన్నాడో మొదటి సినిమాకి ఒక్క ఆర్జీవీకే తెలుసు. ఎందుకంటే అనుభవించింది ఆయనే కామట్టి. ఆర్జీవీకి ఏదైనా క్షణాల్లో అయిపోవాలి. సినిమా సినిమాకి టెక్నీషియన్ మారిపోతుంటాడు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మారిపోతుంటారు.
అంత స్పీడ్ గా ఉండే ఆర్జీవీకి సుమంత్ మాత్రం చుక్కలు చూపించాడట. అంత్రమాలితో అప్పటికే పీకల్లోతు లవ్ లో ఉన్న ఆర్జీవీ సుమంత్ మొదటి సినిమా అనగానే హీరోయిన్ గా అంత్రమాలిని ఫిక్స్ అయ్యాడు. ఆమెతో జర్నీ బాగా సాగుతున్నా షూటింగ్ లో మాత్రం సుమంత్ ఆర్జీవీకి పిచ్చెక్కించాడట. ఒక పట్టాన షాట్ ఒకే అయ్యేది కాదని ఆర్జీవీ చెప్పిన ఎక్స్‌ప్రెషన్ రావడానికి సుమంత్ చాలా టేకులు తీసుకున్నాడని అప్పట్లో టాక్ వినిపించింది.
తప్పక కమిటైయ్యాడు కాబట్టి..ఇంకోవైపు అంత్రమాలి హీరోయిన్ గా కళ్ళముందు కనిపిస్తుంది కాబట్టి ఆర్జీవీ సుమంత్ పెట్టిన హింసను భరించాడట. ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం బాగా వచ్చి ప్రేమకథ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. మొదటి సినిమా అయిన అటు సుమంత్ కి ఇటు అంత్రమాలికి ఆర్జీవి నటనా పరంగా మంచి సినిమా ఇచ్చాడు. ఈ సినిమాకి సందీప్ చౌహతా అందించిన మ్యూజిక్ పెద్ద హిట్. ఇప్పటికీ ‘దేవుడు కరుణిస్తాడని’ అనే పాట మ్యూజిక్ లవర్స్ తిప్పుతూనే ఉంటారు.