Movies2023 లో కళ్లు చెదిరిపోయే రేంజ్ లో రెమ్యూనరేషన్స్ తీసుకున్న హీరోయిన్లు...

2023 లో కళ్లు చెదిరిపోయే రేంజ్ లో రెమ్యూనరేషన్స్ తీసుకున్న హీరోయిన్లు వీళ్లే..!!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కూడా స్టార్ హీరోకి తగ్గట్టు పారితోషకం అందుకుంటున్నారు. కాగా 2023లో అత్యధికంగా హై పారితోషకం తీసుకున్న హీరోయిన్ ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం ..!!

రష్మిక మందన్నా: పుష్ప సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా అనిమల్ సినిమాతో దుమ్మదులుపేసింది . బోల్డ్ బ్యూటీ అంటూ పాపులారిటీ సంపాదించుకుంది .రష్మిక మందన్నా ప్రజెంట్ ఒక్కొక్క సినిమాకి 7 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది .

నయనతార : సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ బ్యూటీ గా సంపాదించుకున్న నయనతార జవాన్ సినిమా కోసం ఏకంగా 15 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసిందట . ఈ న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .

సమంత : హీరోయిన్ సమంత ఒకప్పుడు బాగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేది.. విడాకులు తర్వాత తగ్గించేసింది . మళ్లీ సిటాడిల్ కోసం ఆమె ఏకంగా ఐదు కోట్ల రూపాయలు తీసుకుందట.

త్రిష: సెకండ్ ఇన్నింగ్స్ లో కెరియర్ స్టార్ట్ చేసిన యంగ్ హీరోయిన్స్ కి ధీటుగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది . ఒక్కోక్క సినిమాకి 5 కోట్లు పారితోషకం తీసుకుంటుంది.

శ్రీ లీల : ప్రెసెంట్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్న శ్రీ లీల ఒక్కొక్క సినిమాకి ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ చేతిలో పదికి పైగానే సినిమాలను పెట్టుకొని ఉంది.

ఇక మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ కీర్తి సురేష్ లాంటి హీరోయిన్స్ మూడు కోట్లు నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news