Moviesఆ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి కేవలం 10 రూపాయలనే రెమ్యూనరేషన్...

ఆ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి కేవలం 10 రూపాయలనే రెమ్యూనరేషన్ గా తీసుకున్న రవితేజ.. కారణం ఏంటో తెలుసా..?

రవితేజ కష్టానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ పేరు ఇదే అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హిట్ కొట్టి మెగాస్టార్ గా మారాడు . ఆయన ఇన్స్పిరేషన్ తో రవితేజ కూడా అదే విధంగా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత చిన్న చిన్న కమెడియన్ పాత్రలు చేస్తూ హీరోగా మారి ఆ తర్వాత స్టార్ హీరోగా మారిపోయి ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ మాస్ హీరో .

ప్రెసెంట్ రవితేజ ఒక హిట్ కోసం అల్లాడిపోతున్నాడు కచ్చితంగా రవితేజ ఊపు చూస్తుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి . అయితే రవితేజ తన కెరీర్ లో పది రూపాయలు రెమ్యూనిరేషన్ తీసుకున్నాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రజెంట్ ఒక్కొక్క సినిమాకి 60 నుంచి 70 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న రవితేజ తన కెరియర్ స్టార్టింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసే టైం లో తన సినిమాలకు 10 రెమ్యూనరేషన్ తీసుకున్నారట . ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పుకు రావడం గమనార్హం.

1988లో హీరో అవ్వాలి అని చెన్నై వెళ్లాడు. అక్కడ గుణశేఖర్ రూమ్లో ఉండేవాడు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. ఆ టైంలో జూనియర్ ఆర్టిస్ట్ గా ఆయనకు రోజుకి 10 రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ తీసుకునేవాడట . ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు రవితేజ. దీంతో జనాలు షాక్ అయిపోతున్నారు. అదే కష్టానికి ఫలితం. అందుకే ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయ్యావు అంటూ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news