Moviesమెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూశారా.. ఈసారి మాత్రం ఆ తప్పు...

మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూశారా.. ఈసారి మాత్రం ఆ తప్పు చేయకుండా బ్రతికిపోయారు పో..!!

ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా శ్రీజ – నిహారిక విడాకుల విషయాలు ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో జరిగిన పర్సనల్ విషయాలు నెట్టింట వైరల్ కావడంతో మెగా ఫ్యామిలీ పరువు సగం మేరకు పోయిందని చెప్పాలి. అయితే క్లిం కార పుట్టిన తర్వాత మళ్లీ మెగా పరువు దక్కించుకున్నారు మెగా ఫ్యామిలీ. అంతేకాదు మెగా ఫ్యామిలీలో క్లింకార వచ్చిన తర్వాత వరుసగా అన్ని శుభకార్యాలే ఎక్కడ నెగెటివిటీ అనేది లేకుండా పాజిటివిటీతో సందడి సందడి వాతావరణం నెలకొంది .

కాగా ఏ చిన్న ఫంక్షన్ అయినా మెగా ఫ్యామిలీ కుటుంబ సమేతంగా జరుపుకుంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే . రీసెంట్గా మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది .దీనికి సంబంధించిన పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మెగా ఫ్యామిలీ చాలా ట్రెడిషనల్ గా చాలా హ్యాపీగా అందరూ మేరీ క్రిస్మస్ అంటూ బాగా ఎంజాయ్ చేశారు . అయితే ప్రతిసారి ఏదో ఒక ఫంక్షన్ లో రాంచరణ్ ఉంటే బన్నీ .. బన్నీ ఉంటే రామ్ చరణ్ లేదా స్నేహారెడ్డి లేదా ఉపాసన ఎవరో ఒకరు ఫోటో మిస్ అవుతూ ఉంటారు .

అయితే ఈసారి మాత్రం కలర్ఫుల్ గా కుటుంబం నిండుగా మెగా ఫ్యామిలీ యంగ్ జనరేషన్ ఒక్కచోట ఫోటో దిగ్గింది. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే పలువురు జనాలు వ్యంగ్యంగా కౌంటర్ వేస్తున్నారు . ప్రతిసారి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే మెగా ఫ్యామిలీ ఈసారి మాత్రం బ్రతికిపోయింది అందరూ కుటుంబ సమేతంగా పండగ చేసుకుని అభిమానులకి మంచి ఫీలింగ్ కలుగజేశారు బ్రతికి పోయారు పో ..ఈసారి ట్రోల్లింగ్ బాధ నుంచి తప్పించుకున్నారు అంటూ నాటీ గా కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు మెగా ఫ్యామిలీ పై పడి ఎప్పుడు ఏడవడమేనా మీ పని మీరు చూసుకోండి అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news