Newsరామలక్ష్మణుల లాంటి ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన స్టార్...

రామలక్ష్మణుల లాంటి ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది బ్రదర్స్ ఉన్నారు . కానీ రామలక్ష్మణుల్లా ఉన్నారు రా వీళ్ళు అని చూడగానే అనిపించేది ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. ఇద్దరికీ ఇద్దరే నందమూరి వారసులు . అభిమానులను బాగా అట్రాక్ట్ చేస్తారు . అందంలో నటన విషయంలో గౌరవం విషయంలో మరీ మరీ టాప్ రేంజ్ లో ఉంటారు ఈ ఇద్దరు . అయితే ఎన్టీఆర్ తో కంపేర్ చేస్తే కళ్యాణ్ రామ్ అంత హై స్థానాన్ని అందుకోలేదని చెప్పాలి . ఇప్పుడు ఇప్పుడే కళ్యాణ్రామ్ ట్రాక్ లోకి వస్తున్నాడు.

అయితే గతంలో ఈ అన్నదమ్ములు మధ్య ఓ స్టార్ హీరోయిన్ చిచ్చుపెట్టింది అన్న వార్త ఎక్కువగా వైరల్ అవుతుంది. గతంలో ఎన్టీఆర్ ఓ హీరోయిన్ ని ప్రేమించాడు అని ..ఆమెను నందమూరి ఇంటికి కోడలుగా తీసుకురావాలి అని అనుకున్నాడు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది . అసలు దాని వెనకాల ఉన్న మెయిన్ మేటర్ ఆ హీరోయిన్ ఇష్టపడి ఆ ఇంటి కోడలు అవ్వడానికి ఆయనతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నట్లు మీడియా కంట కనపడింది.

పైగా అదే మూమెంట్లో వాళ్ళిద్దరూ రొమాంటిక్ గా నటించిన సినిమా కూడా రిలీజ్ అవ్వడంతో ఇదంతా నిజమే అనుకున్నారు అప్పట్లో జనాలు . ఆ మూమెంట్ లోనే కళ్యాణ్రామ్ నేరుగా ఎన్టీఆర్ వద్దకు వెళ్లి “ఆ హీరోయిన్ మంచిది కాదు .. మన ఇంటికి తగిన అమ్మాయి కాదు ” అంటూ గోల చేశారట . అప్పటికే ఎన్టీఆర్ అసలు ఆ హీరోయిన్ నేను ఇష్టపడలేదు అని చెప్పినా కళ్యాణ్రామ్ వినలేదట. ఎన్టీఆర్ పై ఫైర్ అయ్యారట. దీంతో మొదటినుంచి కోపం గల ఎన్టీఆర్ కూడా రివర్స్లో తిరిగాడట. కళ్యాణ్రామ్ – తారక్ మాట మాట పెరిగిపోయిందట. ఫైనల్లీ ఎన్టీఆర్ ది తప్పు లేదని తెలుసుకున్న కళ్యాణ్రామ్ ఎన్టీఆర్ కి సారీ చెప్పి మేటర్ సాల్వ్ చేసేసాడు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో మనందరికీ బాగా తెలుసు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news