Newsపెళ్లైన యేడాదికే రెండో భార్య‌కు విడాకులిచ్చిన పృథ్వి... 30 ఏళ్లు చిన్న...

పెళ్లైన యేడాదికే రెండో భార్య‌కు విడాకులిచ్చిన పృథ్వి… 30 ఏళ్లు చిన్న అమ్మాయితో ఎక్క‌డ తేడా కొట్టింది..!

సీనియర్ క్యారెక్టర్ నటుడు బబ్లు పృధ్విరాజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే. బాలనటుడిగా కెరియర్ మొదలుపెట్టిన పృథ్వీరాజ్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విల‌న్‌గా నటించారు. అటు వెండితెరపై .. ఇటు బుల్లితెరపై కనిపించారు. వెండితెరపై ఒక వెలుగు వెలిగిన పృథ్వి ఆ తర్వాత బుల్లితెరపై ఎంట్రీ పలు సీరియ‌ల్స్‌లోను నటించారు. కొన్నేళ్ల క్రితం అవకాశాలు లేక రేసులో వెనుకబడిన ఈ నటుడు ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచాడు. తాజాగా రిలీజ్ అయిన యానిమల్ సినిమాలోను కీలక పాత్రలో నటించాడు.

అలాగే దయ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు పృథ్విరాజ్. 1994 లో బీనా అనే మహిళను పెళ్లాడిన పృథ్వి కి మెహన్ జబ్బర్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఈ దంపతుల మధ్య పొరపచ్చలు వచ్చాయి. ఆరేళ్లపాటు విడివిడిగా జీవించిన వీరు గత ఏడాదికులు తీసుకొని షాక్ ఇచ్చారు. అదే యేడాది షీతల్‌కు దగ్గర అయ్యాడు బ‌బ్లు.

ఆమె కూడా తెలుగమ్మాయి. విచిత్రం ఏంటంటే బబ్లు కంటే షీతల్ ఏకంగా 30 ఏళ్లు చిన్నది. తనకంటే 30 ఏళ్ల పెద్దవాడైన పృథ్వితో జీవితాన్ని పంచుకోవాలని ఉందని షీత‌ల్ చెప్పింది. అప్పట్లోనే వీరి ప్రేమపై చాలా సందేహాలు వ్యక్తం అయ్యాయి. గత ఏడాది నవంబర్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఇంతలోనే వీరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతుంది.

వీరు విడాకులు తీసుకోనన్నట్టు తెలుస్తోంది. బబ్లు తనకు ప్రపోజ్ చేసిన వీడియోను షీతల్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేయడంతో ఈ రూమర్లు మరింత బ‌ల‌పడుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది త్వరలోనే తేలిపోనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news