ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సలార్ పేరు ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. మారుమ్రోగిపోతుంది. చిన్న – పెద్ద – ముసలి – యంగ్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సలార్ సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు . అంతేకాదు సినిమా చూసి వచ్చిన తర్వాత సినిమా రివ్యూలను తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు .
ఈ క్రమంలోనే సలార్ సినిమాకు హ్యూజ్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది . మొదటిరోజు 180 కోట్లు రెండవ రోజు 150 కోట్లు కలెక్ట్ చేసి సంచలనాన్ని సృష్టించిన సలార్ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రశాంత్ నీల్ సలార్ సినిమా విషయంలో రాజమౌళిని దారుణంగా మోసం చేశాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
సలార్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఒక డైలాగ్ అందర్నీ బాగా ఆకట్టుకుంది . టీజర్ ఇంట్రడక్షన్ ఇస్తూ “లయన్-చీతా- టైగర్ – ఎలిఫెంట్ వెరీ డేంజరస్ బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్ బికాజ్ దేర్ ఇస్ డైనోసార్”అంటూ టీజర్ లో టిన్ను ఆనంద్ చెప్పిన ఓ డైలాగ్ భారీ అంచనాలు క్రియేట్ చేసింది . ఈ సీన్ థియేటర్లో చూడాలి అంటూ కోట్లాదిమంది అభిమానులు వెయిట్ చేశారు .
వాళ్లతో పాటు రాజమౌళి కూడా ఈ డైలాగును థియేటర్లు చూడడానికి వెయిట్ చేశాను అంటూ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు. రాజమౌళి ఆశ నెరవేరలేదు. ప్రశాంత్ నీల్ ఆ డైలాగ్ సినిమాలో కట్ చేశారు . ఎందుకు కట్ చేశారు అన్నది తెలియాలి. అయితే వాటిని పార్ట్ 2 లో పెడతారా..? అన్న సందేహాలు ఉన్నాయి . లేకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాలో రాజమౌళి చేసినట్లు ప్రశాంత్ నీల్ ఇక్కడ సలార్ సినిమాలో చేశాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు . గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా ఇలాగే చేశాడు రాజమౌళి . టీజర్ లో ట్రైలర్ లో ఉన్న చాలా సీన్స్ ని ఎత్తేశాడు . బహుశా ప్రశాంత్ నీల్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు ఉన్నాడు..!!