పూజా హెగ్డే ..ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసి ఇప్పుడు అవకాశాల కోసం అల్లాడిపోతున్న ఓ అందాల ముద్దుగుమ్మ. కేవలం పూజ హెగ్డే నే కాదు ఇండస్ట్రీలో చాలామంది బడా స్టార్ హీరోస్ హీరోయిన్స్ ఇలా సినిమా ఇండస్ట్రీలో జరిగే మాయలకు బలైపోయారు. కాగా రీసెంట్ గా పూజా హెగ్డే ఓ బాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది .
ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరో హీరోయిన్లు డైరెక్టర్లు పేర్లు చెప్పే షాక్ ఇచ్చింది . ఇలాంటి క్రమంలోనే ఏ ఇండస్ట్రీ అయినా ఎవరైనా సరే అబ్బాయిలకి అహంకారం ఎక్కువగా హెడ్ వెయిట్ ఎక్కువగా ఉంటే తనకు నచ్చదు అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . నిమిషానికి ఒకసారి మాట మార్చే మగాళ్లు అంటే తనకు అసహ్యం అంటూ ఓపెన్ గానే చెప్పుకు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .
పూజ ఎవరినో గట్టిగా టార్గెట్ చేసిందని ఆ కారణంగానే ఇలా మాట్లాడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోతో దగ్గరగా మూవైన ఈ బ్యూటీ ఆమెకు అవకాశాలు లేకపోవడంతో ఆ హీరో దూరం పెట్టాడని .. ఆ కారణంగానే పూజ ఇలాంటి కామెంట్స్ చేసింది అంటూ చెప్పుకు వస్తున్నారు..!!