పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల మ్యాటర్ ఇండస్ట్రీలో ఎంత వైరల్ గా మారుతుందో మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ నెగటివ్ కామెంట్ చేయాలన్న అందరికీ ఉన్న బిగ్ అస్త్ర ఈ మూడు పెళ్లిళ్లు. అది తప్పిస్తే పవన్ కళ్యాణ్ లో నెగిటివ్గా చూపించడానికి ఏదీ లేదు. ఈ క్రమంలోనే పవన్ కెరియర్ లో మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ఆయనకు మైనస్ గా మారింది . కాగ పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని గురించి చాలా తక్కువ మందికే తెలుసు .
రెండో భార్య రేణు దేశాయ్ మూడో భార్య అన్న లెజినవో గురించి తెలిసినంత ఎక్కువగా కూడా నందిని గురించి ఎవరికీ తెలియదు. అయితే పవన్ కళ్యాణ్ మొదట పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు . ఆ అమ్మాయి పేరు నందిని . ఆమెకి ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది మొత్తం పెద్దలు కుదిరిచిన వివాహమే . అయితే పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని తో నాగార్జున ఫ్యామిలీకి దూరపు సంబంధమే ఉందట.
నందిని వాళ్ళ నాన్నగారికి అక్కినేని నాగేశ్వరరావు గారికి మధ్య దూరపు చుట్టరికం ఉందట. అంతేకాదు నందిని ..నాగార్జునకు వరసకు మరదలు అవుతుందట. నందిని – పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాక అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారట . అయితే ఆ తర్వాత వీళ్లు విడాకులు తీసుకోవడంతో .. నాగేశ్వరావు గారు కూడా భాధపడ్డారట. పవన్ కళ్యాణ్ కి నందినితో విడిపోవద్దు అంటూ కూడా చెప్పుకొచ్చారట . కానీ పవన్ కళ్యాణ్ విడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జీవితం ఎలా మారిపోయిందో మనం చూసాం . ప్రెసెంట్ ఆయన భార్యగా అన్నాలెజినవో రష్యన్ నటి కొనసాగుతుంది..!!