శ్రద్ధా శ్రీనాథ్..అందమైన అమ్మాయి..యంగ్ హీరోలతో పాటు కుర్ర హీరోలకి మంచి జోడి. లక్ కలిసి వస్తే తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో కూడా క్రేజీ హీరోయిన్‌గా పాపులర్ అవ్వాల్సిన హీరోయిన్. కానీ, కొందరికి మొదటి సినిమా సక్సెస్ సాధించిన అది కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడదు..అలా రుజువైన వారిలో శ్రద్ధా శ్రీనాథ్ ఒకరు.
నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా జెర్సీ. ఈ సినిమాతో నాని మంచి ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాతో టాలీవుడ్ కి శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా పరిచయం అయింది. చక్కటి హోంలీ రోల్ చేసి ఇక్కడ ప్రేక్షకులను, మేకర్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ కి తెలుగులో వరుస ఆఫర్స్ వస్తాయనుకున్నారు.
కనైఇ, శ్రద్ధా శ్రీనాథ్ సీన్ రివర్స్ అయింది. అనుకున్నదానికంటే భిన్నంగా అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం జెర్సీతో లాంచ్ అవడమే. కాస్త కూడా గ్లామర్‌గా కనిపించే ఆస్కారం లేని పాత్ర. కానీ, ఇలాంటి పాత్రలు పేరు తెచ్చిపెడతాయి గానీ, ఆశించినంతగా అవకాశాలను మాత్రం తెచ్చిపెట్టవు.
అదే ప్రూవ్ అయింది. ఇలాంటి బ్యూటీ ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ సినిమాతో ఎంట్రీ ఇస్తే ఆ లెక్కలు ఇంకోలా ఉంటాయి. కాస్తో కూస్తో అందచందాలు ఆరబోసే అవకాశం ఉంటుంది. కథ, కథాల పరంగా పర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉంటుంది. కాబట్టి సమంత మాదిరిగా సెటిలవచ్చు. ఇలాంటి డీసెంట్ రోల్ చేసి మెప్పించినా ఆ తర్వాత ఎదురుచూపులు తప్పదు శ్రద్ధా శ్రీనాథ్ మాదిరిగా..!