సినిమా ఇండస్ట్రీలో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనకు ఇష్టం లేకపోయినా సరే అలాంటి సినిమా చేయాల్సి వస్తుంది . దేవుడు మనల్ని ఆ సినిమా చేయొద్దురా ..అంటూ వార్న్ చేసిన సరే తప్పక ఆ సినిమా చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది . ఎన్టీఆర్ కి సైతం అలాంటి ఓ సిచువేషన్ ఎదురై ఆయన కెరియర్ను నాశనం చేసేసింది . ఒకానొక టైంలో ఎన్టీఆర్ స్టార్ హీరోగా కాదు కదా హీరోగా ఆయన కొనసాగుతాడా లేదా అన్న సిచువేషన్ క్రియేట్ అయ్యింది.
సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి నెగటివ్ కామెంట్స్ లేకుండా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కి బాగా దిష్టి తగిలింది . అందుకే వరుసగా ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని బాధ పడిపోయారు. ఆ మూమెంట్ లోనే “నరసింహుడు” సినిమా ఆయన చేతికి వచ్చింది . కథ విని ఈ సినిమా మనకు బాగా సూట్ అవుతుంది అంటూ సైన్ చేసారట. ఆ తర్వాత రెండు నెలల గ్యాప్ తీసుకొని ఎందుకో ఈ సినిమా వద్దంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అంటూ రిజెక్ట్ చేశారట .
మళ్లీ కూడా డైరెక్టర్ ఈ సినిమా మీకే బాగుంటుంది ..మీరు అగ్రిమెంట్ పై సైన్ చేశారు ఆలోచించండి అంటూ ఫోర్స్ చేసినా.. మళ్లీ కూడా ఆయన వద్దకి కథను తీసుకొస్తే “కావాలంటే రెమ్యూనరేషన్ డబ్బులు వెనక్కి చేస్తాను ..ఈ సినిమాగా నేను చేయను ” అంటూ కూసింత ఘాటుగానే చెప్పుకొచ్చాడట ఎన్టీఆర్ . అయితే ఫైనల్లీ ఆ సినిమా ఆయనే చేయాలని రాసి పెట్టింది . డైరెక్టర్ సినీ పెద్దలకు చెప్పించి మరీ ఎన్టీఆర్ చేత ఈ సినిమాను ఓకే చేయించారట . ఇష్టం లేకుండానే ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ కి అలాంటి రిజల్ట్ ఏ వచ్చింది . ఈ సినిమా అసలు ఎన్టీఆర్ ఎందుకు చేశాడు రా బాబు అంటూ చాలామంది జనాలు బాధపడిపోయారు..!!